Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul247e86e6-79b9-45fe-869a-504da18c90eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul247e86e6-79b9-45fe-869a-504da18c90eb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. తన అందం ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టింది. ఇక తన పాత్రలతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ.. ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగానే గడుపుతుంది రకుల్.Rakul{#}shankar;Bharateeyudu;rakul preet singh;Tollywood;Heroine;Darsakudu;Director;Cinema;bollywood;Heroఇన్నేళ్ల నా కెరియర్లో.. ఇదే బెస్ట్ సినిమా : రకుల్ఇన్నేళ్ల నా కెరియర్లో.. ఇదే బెస్ట్ సినిమా : రకుల్Rakul{#}shankar;Bharateeyudu;rakul preet singh;Tollywood;Heroine;Darsakudu;Director;Cinema;bollywood;HeroWed, 12 Jun 2024 09:30:00 GMTప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.  తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. తన అందం ఎంతోమంది కుర్రకారు మతి పోగొట్టింది. ఇక తన పాత్రలతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ.. ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగానే గడుపుతుంది రకుల్.


 అయితే గతంతో పోల్చి చూస్తే అటు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటికీ బాలీవుడ్ కోలీవుడ్ లో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ కి జోడిగా నటించబోతుంది అనేది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే భారతీయుడు 2 సినిమా గురించి హీరోయిన్ రకుల్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా ఇన్నాళ్ల తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవ్వబోతుంది అంటూ రకుల్ చెప్పుకొచ్చింది   ఇందులో క్యారెక్టర్ తన రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఈ హీరోయిన్. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో తాను ఎప్పుడూ కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక శంకర్ లాంటి గొప్ప దర్శకుడు సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అంటూ తెలిపింది. కాగా భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>