PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu8bf427da-d0ca-4f96-bded-d19a283acdaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu8bf427da-d0ca-4f96-bded-d19a283acdaa-415x250-IndiaHerald.jpgజూన్ 12న అంటే ఈరోజు ఏపీలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో చంద్రబాబు నాలుగో సారి ఏపీకి సీఎం అయ్యారు. ఈ సందర్భంగా చాలా మంది ఆయనపై వివిధ రకాలుగా అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం నగరానికి చెందిన ఓ అభిమాని ఒక పెద్ద వస్త్రంపై చంద్రబాబు పెయింటింగ్ వేశారు. ఆయన నవ్వుతున్న చంద్రబాబు ఫేస్‌ను వస్త్రం పై చాలా అద్భుతంగా పెయింట్ చేశారు chandrababu naidu{#}Chittoor;kuppam;CM;Deputy Chief Minister;Pawan Kalyan;Janasena;prema;Love;Amaravati;Fidaa;CBN;Andhra Pradeshబాబుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్.. పెయింటింగ్ అర్థం తెలిస్తే వావ్ అనాల్సిందే!బాబుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్.. పెయింటింగ్ అర్థం తెలిస్తే వావ్ అనాల్సిందే!chandrababu naidu{#}Chittoor;kuppam;CM;Deputy Chief Minister;Pawan Kalyan;Janasena;prema;Love;Amaravati;Fidaa;CBN;Andhra PradeshWed, 12 Jun 2024 14:45:00 GMTజూన్ 12న అంటే ఈరోజు ఏపీలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో చంద్రబాబు నాలుగో సారి ఏపీకి సీఎం అయ్యారు. ఈ సందర్భంగా చాలా మంది ఆయనపై వివిధ రకాలుగా అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం నగరానికి చెందిన ఓ అభిమాని ఒక పెద్ద వస్త్రంపై చంద్రబాబు పెయింటింగ్ వేశారు. ఆయన నవ్వుతున్న చంద్రబాబు ఫేస్‌ను వస్త్రం పై చాలా అద్భుతంగా పెయింట్ చేశారు. దాని ద్వారా బాబు పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. నాలుగో సారి ప్రియమైన బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఆయన ఈ ఆర్ట్ ద్వారా వెల్లడించారు.

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందంటూ ఆర్ట్ కింద రాశారు అలాగే విషెస్ కూడా రాసి దానిని ఒక బిల్డింగ్ పైనుంచి కిందకు వేలాడదీశారు. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఈ వినూత్న శుభాకాంక్షలు హైలైట్ గా మారాయి. ఆ భారీ వస్త్రంపై పెయింటింగ్ అద్భుతంగా ఉండటంతో అందరూ ఫిదా అవుతున్నారు. ఈ పెయింటింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతున్నాయి. చాలామంది ఈ అభిమాని ప్రతిభను పొగుడుతున్నారు.

మరోవైపు బాబుపై అభిమానం వ్యక్తం చేయడానికి సుమారు లక్ష మంది అమరావతి ఇసుక పడవల యజమానుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చారు. అమరావతి రైతులు తో సహా చాలామంది ఇంకా బాబు మీద ప్రేమ కురిపించడానికి పోటెత్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజుతో ఏపీకి డిప్యూటీ సీఎం అయిపోయారు. మరో ముగ్గురు జనసేన నేతలు ఏపీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మరి మొదటగా ఎలాంటి పథకం అమలు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండర్స్, పెన్షన్ పెంపు వంటి పథకాలలో ఏదో ఒక పథకాన్ని చంద్రబాబు త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>