MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajinikanth636bb884-9b28-44ee-ae43-50a709653dae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajinikanth636bb884-9b28-44ee-ae43-50a709653dae-415x250-IndiaHerald.jpgఆలస్యమవుతున్న సూపర్ స్టార్ కూలి షూటింగ్? లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీ కూడా రెడీ అవుతోంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కూలి మూవీని లోకేష్ కనగరాజ్ సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూవీ వస్తుందంటే ఖRajinikanth{#}Komaram Bheem;Lokesh;Lokesh Kanagaraj;Rajani kanth;Blockbuster hit;Hindi;India;News;Cinemaఆలస్యమవుతున్న సూపర్ స్టార్ కూలి షూటింగ్?ఆలస్యమవుతున్న సూపర్ స్టార్ కూలి షూటింగ్?Rajinikanth{#}Komaram Bheem;Lokesh;Lokesh Kanagaraj;Rajani kanth;Blockbuster hit;Hindi;India;News;CinemaWed, 12 Jun 2024 17:02:00 GMTఆలస్యమవుతున్న సూపర్ స్టార్ కూలి షూటింగ్?


లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీ కూడా రెడీ అవుతోంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కూలి మూవీని లోకేష్ కనగరాజ్ సిద్ధం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అలాంటిది ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నే లోకేష్ రంగంలోకి దించుతున్నాడు. గత ఏడాది జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. దాని తర్వాత జై భీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వేట్టయాన్ మూవీని చేస్తున్నారు.ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


మల్టీ స్టారర్ మూవీగా వేట్టయాన్ రాబోతోంది. తెలుగు, మలయాళీ, హిందీ భాషలకి చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ మూవీ కూడా రాబోతోంది. ఆల్ మోస్ట్ ఈ ఏడాదిలోనే వేట్టయాన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఇదిలా ఉంటే లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేయబోయే కూలి సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. జులై 1 నుంచి మొదలు పెట్టబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఇంకా అలాగే క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ అప్డేట్స్ ని మూవీ యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.జైలర్ మూవీతో గత ఏడాది ఏకంగా 600 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ మూవీతో 1000 కోట్ల మార్క్ ని అందుకుంటాడని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>