PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu80ac9885-8fce-4a3d-86c0-56dd83cca7c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu80ac9885-8fce-4a3d-86c0-56dd83cca7c4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో..... మంత్రి పదవి వచ్చిన వారు చాలా హ్యాపీగా ఉంటే... మంత్రి పదవి రాని వారు కాస్త డీలపడ్డారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏకంగా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో కొత్తవారు 17 మంది ఉండటం గమనార్హం. chandrababu{#}choudary actor;politics;Yevaru;Pawan Kalyan;Janasena;Assembly;CBN;Minister;Governmentటీడీపీ : బుచ్చయ్య, అయ్యన్న మధ్య తీవ్ర పోటీ ?టీడీపీ : బుచ్చయ్య, అయ్యన్న మధ్య తీవ్ర పోటీ ?chandrababu{#}choudary actor;politics;Yevaru;Pawan Kalyan;Janasena;Assembly;CBN;Minister;GovernmentWed, 12 Jun 2024 08:35:26 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో..... మంత్రి పదవి వచ్చిన వారు చాలా హ్యాపీగా ఉంటే... మంత్రి పదవి రాని వారు కాస్త డీలపడ్డారు. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏకంగా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో కొత్తవారు 17 మంది ఉండటం గమనార్హం.


అంతేకాదు... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే జనసేన పార్టీకి... మొత్తం మూడు మంత్రు పదవులు రాబోతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి ఒక్కటంటే ఒక్కటి మంత్రి పదవి వచ్చింది. ఇక ఓవరాల్ గా.... ముగ్గురు మహిళలకు కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు చర్చ అంతా... ప్రోటం స్పీకర్ ఎవరు అనే దానిపై  చర్చ జరుగుతోంది.
 

 ఇవాళ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండగా... ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నాయి. దాదాపు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుగా అందరూ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో ప్రోటం స్పీకర్  గా ఎవరు ఎంపిక అవుతారని అందరూ చర్చించుకుంటున్నారు. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి అవకాశం ఉంటుంది.


 ఈ లెక్కన చంద్రబాబు నాయుడు 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు అవకాశం రాదు. ఇక అయ్యన్నపాత్రుడు, లేదా బుచ్చయ్య చౌదరి  ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది. ఈ ఇద్దరు శాసనసభ్యులు ఏడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీనియారిటీ ప్రకారం... బుచ్చయ్య చౌదరికి ప్రొటెమ్ స్పీకర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు కేబినెట్లో... బుచ్చయ్య చౌదరి అలాగే అయ్యన్నపాత్రుడికి  అవకాశమే లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>