PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp6933ac51-55f7-4ac8-aa97-475bfedc7b52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp6933ac51-55f7-4ac8-aa97-475bfedc7b52-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎంపీలు గెలవగా.... ఇందులో కేవలం ఇద్దరికీ మాత్రమే పదవులు వచ్చాయి. మిగతా 6 మంది కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పదవులు రాని మిగతా 6 మంది పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. bjp{#}Karimnagar;Allu Aravind;Cabinet;politics;Backward Classes;Bharatiya Janata Party;central government;Minister;MP;News;Telangana;Partyతెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఈ నాయకుడికే ?తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఈ నాయకుడికే ?bjp{#}Karimnagar;Allu Aravind;Cabinet;politics;Backward Classes;Bharatiya Janata Party;central government;Minister;MP;News;Telangana;PartyWed, 12 Jun 2024 17:30:20 GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎంపీలు గెలవగా.... ఇందులో కేవలం ఇద్దరికీ మాత్రమే పదవులు వచ్చాయి. మిగతా 6 మంది కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పదవులు రాని మిగతా 6 మంది పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. 


వీరికి కేంద్రమంత్రి పదవులు గ్యారెంటీ అంటూ మొదటి నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ అధిష్టానం మాత్రం ముందు నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైపు మొగ్గు చూపింది. దీని ద్వారా పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం జరగదన్న సంకేతాలు పంపింది. అలాగే కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. బిజెపి పెద్దలు గెలిచిన ఎనిమిది మంది ఎంపీలలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే రాజకీయంగా పార్టీలో పుట్టి పెరిగారు.


మిగతావారు ఏదో ఒక పార్టీలో పనిచేసి బిజెపి కండువా కప్పుకున్నవారే.ఇలాంటి నేపథ్యంలో.... కేంద్ర మంత్రిత్వ శాఖలు కేవలం బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డిలకు మాత్రమే వివరించాయి. మిగతా ఆరుగురికి మాత్రం మొండి చేయి చూపించింది మోడీ ప్రభుత్వం.  ఇక పదవి రాని వారిలో... ఒకరికి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇందులో మొదటి వరుసలో ఈటెల రాజేందర్,  డీకే అరుణ పేర్లు ముందుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కాకపోతే... నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్  పేరును పరిశీలన లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే.... ఇందులో ఈటెల రాజేందర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది.  ఎందుకంటే గతంలో మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా పనిచేశారు ఈటల రాజేందర్. అలాగే బీసీ ముదిరాజు బిడ్డ. బీసీ పార్టీ అని చెప్పుకునే బిజెపి పార్టీ... ఈటెల రాజేందర్ కు ఆ పదవి కట్టబెడితే... చాలా ప్లస్ అవుతుందని భావిస్తోందట. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా చేయనుందట







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>