Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8f798fb9-8257-4e38-b9db-2cd66b1d9dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8f798fb9-8257-4e38-b9db-2cd66b1d9dec-415x250-IndiaHerald.jpgఘట్టమనేని అల్లుడు, టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.అతను చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తాడు.. వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. తన మేనమామ పోలికలు ఎక్కువగా ఉండటంతో అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అతని జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ చూసి ఎప్పటికైనా తన మామ అంతటి వాడు అవుతాడని అభిమానులు కామెంట్లు చేస్తుంటారు. అయితే మానస్కు మాsocialstars lifestyle{#}Allu Aravind;chaitan bharadwaj;maanas;sudigali sudheer;sumanth;Chittoor;kuppam;Dwaraka;maya;malavika new;sudheer babu;sree;electricity;Heroine;Tollywood;sunil;marriage;Thriller;Success;lord siva;Shiva;bollywood;Chitram;Cinema;Father;krishna;Rajani kanth;CBNహాలీవుడ్ రేంజ్ లో స్టంట్ లు చేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు..!!హాలీవుడ్ రేంజ్ లో స్టంట్ లు చేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు..!!socialstars lifestyle{#}Allu Aravind;chaitan bharadwaj;maanas;sudigali sudheer;sumanth;Chittoor;kuppam;Dwaraka;maya;malavika new;sudheer babu;sree;electricity;Heroine;Tollywood;sunil;marriage;Thriller;Success;lord siva;Shiva;bollywood;Chitram;Cinema;Father;krishna;Rajani kanth;CBNWed, 12 Jun 2024 13:00:00 GMTఘట్టమనేని అల్లుడు, టాలీవుడ్ హీరో సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.అతను చూడ్డానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తాడు.. వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. తన మేనమామ పోలికలు ఎక్కువగా ఉండటంతో అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అతని జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ చూసి ఎప్పటికైనా తన మామ అంతటి వాడు అవుతాడని అభిమానులు కామెంట్లు చేస్తుంటారు. అయితే మానస్కు మాత్రం తనని ఎవరైనా మహేష్ బాబులా ఉన్నావంటే కోపం వచ్చేస్తుందట. ఈ విషయాన్ని అతని తండ్రి సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.'హరోం హర' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కుమారుడు గురించి మాట్లాడారు. "చరిత్ మానస్ తన మామ మహేష్ పోలికలతో ఉన్నాడని 'మోసగాళ్ళకు మోసగాళ్ళు' రీ రిలీజ్ టైంలో అందరూ నోటీస్ చేశారు. అప్పటి నుంచీ అతని పాత వీడియోలు కూడా బయటకి తీసుకొచ్చారు. నిజానికి అది వాడికి ఇష్టముండదు. ఎవరన్నా వచ్చి మహేష్.. మహేష్ బాబులా ఉన్నావని అంటే వాడికి కోపం వచ్చేస్తుంది. అయినా సరే అది యాక్సెప్ట్ చేస్తాడు. అప్పీరియన్స్ వల్ల అతనిలో ఒక స్పార్క్ ఉందని అందరూ నోటీస్ చేశారు కానీ.. వాడి డ్యాన్సులు, స్టంట్ వీడియోల కారణంగానే అది కంటిన్యూ అవుతోందని నేను భావిస్తున్నాను. గత ఏడాదిన్నరగా వాడి కష్టాన్ని చూస్తున్నారు కాబట్టే, ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యామిలీ పేరు చెప్పుకొని బతకడానికి వచ్చాడురా అనుకునేలా వాడు కనిపించడం లేదు. వాడి కష్టం వాడు చేస్తున్నాడు. ఈ ఏజ్ లో ఎంతమంది అలా చెయ్యగలుగుతారు. ఇప్పుడు వాడు చేసే కొన్ని స్టంట్స్ ఇండియాలో ఎవరూ చెయ్యలేరు. బాలీవుడ్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమాల్ రేంజ్ లో చేస్తున్నాడు" అని సుధీర్ బాబు అన్నారు. చరిత్ మానస్ వయస్సు ఇప్పుడు 16 ఏళ్ళని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు.

నటశేఖర కృష్ణ కుమార్తె ప్రియదర్శినిని పెళ్లి చేసుకొని సూపర్ స్టార్ అల్లుడిగా మారిన సుధీర్ బాబు.. 'ఏ మాయ చేసావే' సినిమాతో తెరంగేట్రం చేసారు. 'SMS - శివ మనసులో శృతి' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నారు. ఈ విధంగానే 'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ', 'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'సమ్మోహనం' వంటి చిత్రాలతో అలరించారు. అయితే గత కొన్నాళ్లుగా సుధీర్ బాబు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'హరోం హర' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. 'హరోం హర' అనేది 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ది రివోల్ట్ అనేది దీనికి ట్యాగ్లైన్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్లో డైలాగులు చెప్పనున్నారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ జి నాయుడు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.ఈ చిత్రం జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>