Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap480942e3-e34d-41f2-ac1c-c2663c76673c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap480942e3-e34d-41f2-ac1c-c2663c76673c-415x250-IndiaHerald.jpgఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టిడిపి పార్టీలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. రజినీకాంత్, చిరంజీవి లాంటి ప్రముఖులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. 11: 27 గంటAp{#}Lokesh;naina;Lokesh Kanagaraj;Sasanamandali;Chiranjeevi;Prime Minister;central government;Governor;Assembly;TDP;CBN;CM;MinisterMLA గా గెలవకపోయినా.. మంత్రి పదవి వస్తుందా?MLA గా గెలవకపోయినా.. మంత్రి పదవి వస్తుందా?Ap{#}Lokesh;naina;Lokesh Kanagaraj;Sasanamandali;Chiranjeevi;Prime Minister;central government;Governor;Assembly;TDP;CBN;CM;MinisterWed, 12 Jun 2024 10:15:00 GMTఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టిడిపి పార్టీలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. రజినీకాంత్, చిరంజీవి లాంటి ప్రముఖులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. 11: 27 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది అని చెప్పాలి.


 అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే కాదు.. మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. దీంతో ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఇలా మంత్రివర్గ విస్తరణ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తులు సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంటుందట. సీఎం సిఫారసు చేసిన వ్యక్తితో ఎమ్మెల్యేగా గెలవక పోయినప్పటికీ ఇక గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారట.


 అయితే ఇలా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు ఆరు నెలల్లోగా అసెంబ్లీ లోనైనా లేదంటే శాసన మండలిలో నైనా సభ్యుడిగా ఎన్నికవ్వాలి. లేదంటే ఇక సదరు నేత మంత్రిగా పని చేయడానికి వీలు ఉండదు అని చెప్పాలి. గతం లో  చంద్రబాబు వారసుడు లోకేష్ విషయం లో కూడా ఇదే జరిగింది. మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు ఐటి మినిస్టర్ గా పదవి దగ్గర దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన లోకేష్ కి ఆరు నెలల కాలంలో శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావడంతో ఇక మంత్రి పదవిలోనే కొనసాగారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>