MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa9a43f32e-c9f6-4661-a540-4f2daa81148e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa9a43f32e-c9f6-4661-a540-4f2daa81148e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుండి మొదట మెగాస్టార్ హీరో అయ్యారు. ఆయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ, ఒక్కో విజయాన్ని అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. అలా ఎదగడం మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు అనుగుణంగా తన జీవితాన్ని ఉంచుకొని ఎంతో మంది కి ఆదర్శప్రాయంగా నిలిచాడు. మెగా ఫ్యామిలీలో మంచి స్థాయి ఉన్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలaa{#}Nandyala;Allu Arjun;Chiranjeevi;kalyan;Janasena;Tollywood;Hero;Party;News;YCP;Telugu;mediaఅల్లు అర్జున్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన మెగా హీరో..!అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన మెగా హీరో..!aa{#}Nandyala;Allu Arjun;Chiranjeevi;kalyan;Janasena;Tollywood;Hero;Party;News;YCP;Telugu;mediaWed, 12 Jun 2024 18:29:15 GMTతెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుండి మొదట మెగాస్టార్ హీరో అయ్యారు. ఆయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ, ఒక్కో విజయాన్ని అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. అలా ఎదగడం మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు అనుగుణంగా తన జీవితాన్ని ఉంచుకొని ఎంతో మంది కి ఆదర్శప్రాయంగా నిలిచాడు.

మెగా ఫ్యామిలీలో మంచి స్థాయి ఉన్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మెగా ఫ్యామిలీ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఈయన కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేయడం మాత్రమే కాకుండా తను పార్టీ నుండి చాలా మందిని పోటీలోకి దింపారు.

ఒక ఇంట్లోనే రాజకీయ పార్టీ ఉండటంతో మెగా ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులంతా మొదటి నుండి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుండి పోటీ చేసిన వైసిపి పార్టీ అభ్యర్థికి సపోర్టుగా నిలిచాడు. దానితోనే వీరి కుటుంబంలో విభేదాలు తలెత్తాయి అని వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత పవన్ పార్టీ సభ్యులు గెలవడం , ఆయన గెలవడంతో మెగా కుటుంబ సభ్యులు అంతా కోలాహలంగా గడిపారు.

ఇకపోతే మెగా కుటుంబంలో మరో కీలకమైన వ్యక్తి సాయి ధరమ్ తేజ్. ఈయన తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారాలు కూడా చేశాడు. పవన్ గెలవడంతో ఈయన ఆనందానికి హద్దే లేదు. గెలుపు తర్వాత పవన్ తో కలిసి ఆనందంగా గడిపిన సమయానికి సంబంధించిన ఫోటోలను , వీడియోలను ఈయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇకపోతే ఈయన తన సోషల్ మీడియా అకౌంట్ లలో అల్లు అర్జున్ ను ఆన్ ఫాలో చేశాడు. దీనితో ఈయన ఎందుకు అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసి ఉంటాడా ..? అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>