PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-ap-cinematography-minister-tdp9675300d-3ce7-4349-9259-c8b51c31249b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-ap-cinematography-minister-tdp9675300d-3ce7-4349-9259-c8b51c31249b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు మరియు తన కేబినెట్ మంత్రులంతా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే తరుణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి ఎలాంటి మంత్రి పదవులు వస్తాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు కూడా ఆ లిస్టును బయట పెట్టలేదు. డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రమే వారి పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని పేర్లతో కొన్ని లిస్టులు బయటకు వచ్చాయి. కానీ అవి ఎవBALAKRISHNA;AP;CINEMATOGRAPHY MINISTER;TDP{#}Hindupuram;Cabinet;Industry;Balakrishna;Father;Nijam;Yevaru;politics;Minister;Cinema;Hero;TDP;Andhra Pradesh;CBNబాలకృష్ణకు మంత్రి పదవి ఫిక్స్.. ఏ శాఖంటే.?బాలకృష్ణకు మంత్రి పదవి ఫిక్స్.. ఏ శాఖంటే.?BALAKRISHNA;AP;CINEMATOGRAPHY MINISTER;TDP{#}Hindupuram;Cabinet;Industry;Balakrishna;Father;Nijam;Yevaru;politics;Minister;Cinema;Hero;TDP;Andhra Pradesh;CBNWed, 12 Jun 2024 07:23:00 GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టిడిపి ప్రభుత్వం ఏర్పడబోతోంది.  చంద్రబాబు మరియు తన కేబినెట్  మంత్రులంతా  ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే తరుణంలో  ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా   నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి ఎలాంటి మంత్రి పదవులు వస్తాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు కూడా ఆ లిస్టును బయట పెట్టలేదు. డైరెక్ట్ గా  ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రమే వారి పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.  సోషల్ మీడియాలో కొన్ని పేర్లతో కొన్ని లిస్టులు బయటకు వచ్చాయి. కానీ అవి ఎవరు నమ్మడం లేదు.  ఇదే తరుణంలో టిడిపిలో ఎంతో సీనియర్ అయినటువంటి హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి మూడోసారి పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.  

ఈసారి ఆయనకు తప్పక మంత్రి పదవి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. బాలకృష్ణకు ఏ శాఖలో మంత్రి పదవి ఇస్తారు ఆయనకు ఏ శాఖ అయితే సెట్ అవుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో అసలు బాలకృష్ణకు మంత్రి పదవి చేయాలని ఉందో లేదో అనేది కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.  ముఖ్యంగా బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆయన మంత్రి పదవి తీసుకుంటే మాత్రం ఇక సినిమాలకు కాస్త దూరం అవ్వాల్సి వస్తుంది.  ఇదే తరుణంలో ఆయన మంత్రి పదవి పై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం అయితే కనిపించడం లేదట.

కానీ హిందూపురం ప్రజలు మాత్రం ఆయనకు ఈసారి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రి అయితేనే సెట్ అవుతుందని ఆలోచన చేస్తున్నారట. అంతేకాకుండా టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఆయనకు ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి సినిమా రంగంలో మంత్రి ఇస్తే మాత్రం తన నాన్న కన్న కలలను ఇండస్ట్రీ పరంగా ఆయన నిజం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.  హిందూపురం ప్రజలు సినిమా వాళ్లు ఆలోచన చేసిన విధంగా బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>