PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn7d447084-f0a4-47ac-a7fb-44c2f2fcf1e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn7d447084-f0a4-47ac-a7fb-44c2f2fcf1e7-415x250-IndiaHerald.jpgనారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రెండు సార్లు ముఖ్య మంత్రి గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం మొదటి సారి జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో టి డి పి పార్టీ భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడంతో మూడవ సారి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి గా పనిచేశారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో టి డి పి పార్టీ జనసేన , బి జె పి లతో cbn{#}Chiranjeevi;Pawan Kalyan;Rajani kanth;Balakrishna;vedhika;Minister;Telangana Chief Minister;CM;Party;Telugu;Parliment;Assembly;Andhra Pradesh;CBNచంద్రబాబు ప్రమాణ స్వీకారం : కదిలి వచ్చిన సినీ ప్రముఖులు..!చంద్రబాబు ప్రమాణ స్వీకారం : కదిలి వచ్చిన సినీ ప్రముఖులు..!cbn{#}Chiranjeevi;Pawan Kalyan;Rajani kanth;Balakrishna;vedhika;Minister;Telangana Chief Minister;CM;Party;Telugu;Parliment;Assembly;Andhra Pradesh;CBNWed, 12 Jun 2024 11:35:00 GMTనారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రెండు సార్లు ముఖ్య మంత్రి గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం మొదటి సారి జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో టి డి పి పార్టీ భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడంతో మూడవ సారి చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి గా పనిచేశారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో టి డి పి పార్టీ జనసేన , బి జె పి లతో పొత్తుల భాగంగా పోటీ చేసింది.

ఇక ఈ కూటమికి అద్భుతమైన స్థాయిలో స్థానాలు దక్కాయి. అలాగే టి డి పి కి ఒంటరి గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయి సీట్లు వచ్చాయి. దానితో ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప గుర్తింపు కలిగిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న వేదికకు పైకి వచ్చారు.

అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార స్థలానికి విచ్చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు స్వీకారం వేదిక సినీ తారలతో కళకళలాడుతుంది. ఇక ఇంతమంది సినీ ప్రముఖల మధ్యలో చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>