PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించే నాయకుడు ఎవరు అని అడిగితే చాలామందికి గుర్తుకు వచ్చేది చంద్రబాబు మాత్రమే. Sr.ఎన్టీఆర్ తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకొని టిడిపిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ధీరుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓటమిని చూసాడు.. గెలుపును అనుభవించాడు.. ఇంతటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గురించి మనం ఒక్కమాటలో చెప్పలేం. ఎమ్మెల్యేగా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి, మంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రకాల పదవులు అనుభవించిcm chandrababu;tdp;ycp;sr ntr;ap;jagan;congress{#}Chittoor;september;history;YCP;Yevaru;Chandragiri;marriage;NTR;June;Telugu;Telangana Chief Minister;TDP;CBN;Andhra Pradesh;Party;Congress;Cabinet;Telangana;Assembly;Manamచంద్రబాబు: అతడే ఒక సైన్యం..పేదల ఆరాధ్య దైవం..!!చంద్రబాబు: అతడే ఒక సైన్యం..పేదల ఆరాధ్య దైవం..!!cm chandrababu;tdp;ycp;sr ntr;ap;jagan;congress{#}Chittoor;september;history;YCP;Yevaru;Chandragiri;marriage;NTR;June;Telugu;Telangana Chief Minister;TDP;CBN;Andhra Pradesh;Party;Congress;Cabinet;Telangana;Assembly;ManamTue, 11 Jun 2024 10:01:16 GMT
- రాష్ట్ర అభివృద్ధికి జవాబు చంద్రబాబు..
- అలుపెరుగని పోరాటం చంద్రబాబు సొంతం..


 తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించే నాయకుడు ఎవరు అని అడిగితే చాలామందికి గుర్తుకు వచ్చేది చంద్రబాబు మాత్రమే. Sr.ఎన్టీఆర్ తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకొని టిడిపిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ధీరుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  ఓటమిని చూసాడు.. గెలుపును అనుభవించాడు.. ఇంతటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గురించి మనం ఒక్కమాటలో చెప్పలేం. ఎమ్మెల్యేగా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి, మంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా  అన్ని రకాల పదవులు అనుభవించి ఎంతో అనుభవాన్ని గడించారు నారా చంద్రబాబు నాయుడు.  ఈయన చిత్తూరు జిల్లా  చంద్రగిరి మండలం నారావారిపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు.

సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు.కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తనివితీరా అనుభవించారు. దీంతో ఆయన ఎలాగైనా ప్రజాసేవచేసి ఇదంతా మార్చాలి అనుకున్నాడు. చదువుకునే రోజుల నుంచి యువజన కాంగ్రెస్ విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. ఆ టైంలో 20% కోటా సీట్లను యువజన కాంగ్రెస్ కు అందించడంతో చంద్రబాబుకు కలిసి వచ్చింది. 1978వ సంవత్సరంలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టిన చంద్రన్న అప్పటి ముఖ్యమంత్రి  టంగుటూరి అంజయ్య క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి సినీ స్టార్ ఎన్టీఆర్ కళ్ళల్లో పడ్డారు. దీంతో బాబు క్యారెక్టర్ గమనించిన ఎన్టీఆర్ తన మూడవ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రారంభం తర్వాత ఆ పార్టీలో చేరి తన రాజకీయాన్ని మరింత వేగవంతం చేశారు.

 అలా ఎన్టీఆర్ తర్వాత టిడిపి పగ్గాలు పూర్తిగా తన చేతిల్లోకి తీసుకున్న చంద్రబాబు  1995 సెప్టెంబర్ 1న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1998లో హైదరాబాదులోని హైటెక్ సిటీని ప్రారంభించి తక్కువ కాలంలోనే ఐటీ రంగాన్ని అగ్రగామిగా నిలపడంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక  కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. అయితే తెలంగాణ రాష్ట్రంతో విడిపోయిన తర్వాత కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు సేవలందించారు. ఇక 2019లో ఘోర ఓటమిని చవిచూసిన చంద్రబాబును వైసీపీ యువ నాయకులంతా నిందించారు. ఆయన పని అయి పోయిందనుకున్నారు. ఎన్నో అక్రమ కేసులు బనాయించారు.  టిడిపి పార్టీ లేదు అనే మాటలు మాట్లాడారు. చివరికి చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా ఏడిపించి వారు రాక్షసానందం పొందారు. అయినా వదలకుండా  చంద్రబాబును చివరికి జైలుకు కూడా పంపారు. ఇవన్నీ పంటికింద దిగబట్టుకున్నటువంటి చంద్రబాబు  ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలనుకున్నాడు.  తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి సైలెంట్ గా వైసీపీని దెబ్బ కొట్టాడు.  ఇక ఆయన దెబ్బకు వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి చేరుకుంది. అలాంటి చంద్రబాబు 2024 జూన్ 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>