PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrabbau-win-shopes-ap-politics-202444216f57-287e-49fe-b10a-96d56bd137e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrabbau-win-shopes-ap-politics-202444216f57-287e-49fe-b10a-96d56bd137e4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం నాయకులంతా కూడా ఎక్కువగా ప్రజలకు మేనిఫెస్టో రూపంలో వరాలు కురిపిస్తూ వారిని ఆకర్షిస్తూ గెలుపొందేలా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని టిడిపి పార్టీ ఓటు బ్యాంకు కోసం నానాతిప్పలు పడింది. 40 ఏళ్లు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలలో మందు బాబులకు నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి తీసుకొస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఆ బాధ్యతలు తీసుకోక ముందే మాట నిలబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు అన్ని కంపెనీలకు బేవరేజెస్ కార్పొరేషన్లు ఆర్డర్లు ఇచ్చినట్లుగా సమాచారం. చంద్రబాబు భావిస్తున్న నCHANDRABBAU;WIN SHOPES;AP POLITICS;2024{#}Jagan;Reddy;TDP;CBNచంద్ర బాబు: ఆ విషయంలో మాట నిలబెట్టుకున్నట్టేనా..?చంద్ర బాబు: ఆ విషయంలో మాట నిలబెట్టుకున్నట్టేనా..?CHANDRABBAU;WIN SHOPES;AP POLITICS;2024{#}Jagan;Reddy;TDP;CBNTue, 11 Jun 2024 13:17:00 GMTప్రస్తుతం నాయకులంతా కూడా ఎక్కువగా ప్రజలకు మేనిఫెస్టో రూపంలో వరాలు కురిపిస్తూ వారిని ఆకర్షిస్తూ గెలుపొందేలా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని టిడిపి పార్టీ ఓటు బ్యాంకు కోసం నానాతిప్పలు పడింది. 40 ఏళ్లు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలలో మందు బాబులకు నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి తీసుకొస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఆ బాధ్యతలు తీసుకోక ముందే మాట నిలబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు అన్ని కంపెనీలకు బేవరేజెస్ కార్పొరేషన్లు ఆర్డర్లు ఇచ్చినట్లుగా సమాచారం. చంద్రబాబు భావిస్తున్న నాణ్యమైన మద్యం ఇక త్వరలోనే అన్ని దుకాణాలలో కూడా కనిపించబోతోంది.


జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో తనను గెలిపిస్తే మద్యపాన నిషేధం తీసుకువస్తానంటూ హామీ ఇచ్చినప్పటికీ అయితే ఆ పని చేయడానికి కొన్ని మార్గాలను అనుసరించారు. ముఖ్యంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి ప్రైవేటీ సిండికేట్ల దందా లేకుండా చేశారు.. ప్రభుత్వ ఆధ్వర్యం లోని దుకాణం నిర్వహించి కొన్ని బ్రాండ్లను తీసుకువచ్చి అలవాటును మాన్పించే విధంగా అమ్మకాలను చేపట్టారు. పైగా ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు అనే విషయం కనిపించలేదు.


మద్యపాన నిషేధం అంటే కేవలం అంగళ్లు మూసి వేయడమే కాదు ప్రజలలో మద్యం  అలవాటును కూడా మానిపించాలనే సిద్ధాంతాన్ని జగన్ అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కొత్త బ్రాండ్లను తీసుకువచ్చి ధరలు కూడా పెంచారు.. దీంతో కొంతమేరకు ప్రజలలో వ్యాసనం తగ్గుముఖం పట్టినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా మందుబాబులకు తాను గెలిస్తే క్వాలిటీ మద్యాన్ని అందిస్తానని అది కూడా తక్కువ ధరకే అందిస్తానంటూ తెలియజేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గెలవడంతో ఇప్పుడు ప్రజలు ఎక్కువగా వ్యాసనానికి బానిసైన రకాల బ్రాండ్లను దుకాణంలోకి తీసుకువచ్చారు.ఏది ఏమైనా మందుబాబులకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు తన మాటను సైతం నిలబెట్టుకున్నారని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>