Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea529177c-e75f-4319-b44f-57cc0175182c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea529177c-e75f-4319-b44f-57cc0175182c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్న టాక్ షో ఏదైనా ఉంది అంటే.. అది సుడిగాలిసుధీర్ వ్యాఖ్యత గా చేస్తున్న 'సర్కార్ సీజన్ 4' అనే చెప్పాలి.ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షో మూడు సీజన్లు ముగిశాయి. అయితే వాటికి ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉండగా.. నాలుగో సీజన్లో సుడిగాలి సుధీర్ వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచీ ఈ కొత్త సీజన్ దూసుకెళ్తోంది. ఆహాలోని టాప్ ట్రెండింగ్ షోలలో నంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ గేమ్ షో టాప్ లోనే ఉండటం విశేషం.సుడిగాలి సుధీర్ ఉన్నsocialstars lifestyle{#}SoniaGandhi;sudigali sudheer;Allari;Episode;Friday;siri;pradeep;Athadu;Comedy;monday;Telugu;GEUMరచ్చ లేపుతున్న సుధీర్ సర్కార్ 4 కొత్త ప్రోమో..!!రచ్చ లేపుతున్న సుధీర్ సర్కార్ 4 కొత్త ప్రోమో..!!socialstars lifestyle{#}SoniaGandhi;sudigali sudheer;Allari;Episode;Friday;siri;pradeep;Athadu;Comedy;monday;Telugu;GEUMTue, 11 Jun 2024 10:45:00 GMTప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్న టాక్ షో ఏదైనా ఉంది అంటే.. అది సుడిగాలిసుధీర్ వ్యాఖ్యత గా చేస్తున్న 'సర్కార్ సీజన్ 4' అనే చెప్పాలి.ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షో మూడు సీజన్లు ముగిశాయి. అయితే వాటికి ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉండగా.. నాలుగో సీజన్లో సుడిగాలి సుధీర్ వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచీ ఈ కొత్త సీజన్ దూసుకెళ్తోంది. ఆహాలోని టాప్ ట్రెండింగ్ షోలలో నంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ గేమ్ షో టాప్ లోనే ఉండటం విశేషం.సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే అది ఏ షో అయినా సూపర్ హిట్టే. కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ షో కూడా సుధీర్ రాక తర్వాతే ఆ ఓటీటీలో టాప్ షోగా మారింది.ప్రతి శుక్రవారం ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ వస్తుంది. తాజాగా రాబోయే శుక్రవారం (జూన్ 14) వచ్చే 9వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సర్కార్ షో 9వ ఎపిసోడ్ ప్రోమోను సోమవారం (జూన్ 10) రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సోనియా, సిద్ధు.. సిరి హనుమంతు, శ్రీహాన్ జంటలు వచ్చాయి. సుధీర్ ఈ నలుగురితో కలిసి ఆడుకోవడం, ఆ నలుగురూ సుధీర్ తో ఆడుకోవడం.. ఇలా నాలుగున్నర నిమిషాల ప్రోమో సరదాగా సాగిపోయింది. సుధీర్ తనదైన స్టైల్లో కామెడీ పండించాడు.

నా కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ ఇందులో తనమీద తానే జోకులు కూడా వేసుకున్నాడతడు. ఇక ఈ రెండు జంటలూ అతనితో ఆడుకున్నాయి. వాళ్లు అతనిపై వేసిన పంచ్ లు నవ్వు తెప్పించాయి. ఈ మధ్యే ఎందుకు నీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని శ్రీహాన్ అడిగితే.. సరసమైన ధరలకు అని చూసి షాపులోకి వెళ్తే అక్కడ ధరలు ఉన్నాయి కానీ సరసం లేదంటూ సుధీర్ చెప్పడం విశేషం.ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మరోసారి ట్రెండింగ్ లోకి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇంక వీళ్లకి తోడు మరో వైరల్ జంట సోనియా సింగ్- పవన్ సిద్ధూ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇంక వాళ్ల కామెడీ కూడా మిమ్మల్ని పడి పడి నవ్వేలా చేస్తుంది. ఇంక సగం అర్థమయ్యి.. సగం అర్థం కాకుండా.. సోనియా సింగ్ చేసే అల్లరికి పొట్ట చక్కలు అవుతుంది. వీటన్నింటికి మించి సుడిగాలి సుధీర్ యాంకరింగ్ మెప్పిస్తుంది. ఇలా ఈ సర్కార్ సీజన్ 4న్యూ ఎపిసోడ్ కచ్చితంగా ట్రెండింగ్ లోకి వస్తుందని అర్థమవుతోంది.సర్కార్ గేమ్ షోలో ఇప్పటికే 8 ఎపిసోడ్లు ముగియగా.. ఈ 9వ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (జూన్ 14) రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త ఎపిసోడ్లో ఆ రెండు జంటలతో కలిసి సుధీర్ చేసే అల్లరి మామూలుగా ఉండబోవడం లేదని ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి అసలు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>