PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr5e99c67c-7af3-437b-9d57-650000fb28bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr5e99c67c-7af3-437b-9d57-650000fb28bb-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్నటి వరకు... కీలక పదవులు అనుభవించిన నేతలు జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, మొన్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత దారుణంగా గులాబీ పార్టీ ఓడిపోవడం... ఈ రెండు అంశాల నేపథ్యంలో.. ఒక్కో కీలక నేత జారుకుంటున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపిలో... గులాబీ పార్టీ నేతలు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. kcr{#}KTR;Josh;KCR;Mass;Medak;News;Parliment;Parliament;Party;Congress;Telangana;Ministerకేసీఆర్‌: కేటీఆర్‌ పదవికి ఎసరు పెట్టిన హరీష్‌ రావు ?కేసీఆర్‌: కేటీఆర్‌ పదవికి ఎసరు పెట్టిన హరీష్‌ రావు ?kcr{#}KTR;Josh;KCR;Mass;Medak;News;Parliment;Parliament;Party;Congress;Telangana;MinisterTue, 11 Jun 2024 09:36:00 GMTతెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్నటి వరకు... కీలక పదవులు అనుభవించిన నేతలు జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, మొన్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత దారుణంగా గులాబీ పార్టీ ఓడిపోవడం... ఈ రెండు అంశాల నేపథ్యంలో.. ఒక్కో కీలక నేత జారుకుంటున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపిలో... గులాబీ పార్టీ నేతలు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 

అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో... 17 స్థానాల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ... అన్నిచోట్ల ఓడిపోయింది. మొత్తం 16 చోట్ల డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది ఉద్యమ పార్టీ. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీకి... మెదక్ ఎంపి స్థానంలో మాత్రమే డిపాజిట్ దక్కింది. అక్కడ తక్కువ మెజారిటీతోనే...గులాబీ పార్టీ ఓడిపోయింది. అయితే పార్టీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. కేటీఆర్ పై వేటు వేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది.



 గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా, లేదా ఓటమి పాలైన ఆ బాధ్యత మొత్తం కేటీఆర్ పైన ఉంటుంది. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత దారుణంగా.. గులాబీ పార్టీ ఓడిపోయింది. దీంతో కేటీఆర్ ను ఆ పోస్ట్ నుంచి తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేటీఆర్ స్థానంలో మాజీ మంత్రి హరీష్ రావును... గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని అనుకుంటున్నారట.

 

 ఈ మేరకు కేటీఆర్ అలాగే హరీష్ రావులతో కూడా కేసీఆర్ చర్చించారట. హరీష్ రావు గులాబీ పార్టీ పగ్గాలు  ఇస్తే.. పార్టీకి మంచి జోష్ వస్తుందని అనుకుంటున్నారట కేసీఆర్. హరీష్ రావు పూర్తిగా మాస్ లీడర్ కనుక... ఆయనకు...  మంచి ఆదరణ ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. అయితే ఈ వార్త బయటకు రావడంతో... కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీలు... గులాబీ పార్టీ పై సెటైర్లు పేల్చుతున్నాయి. హరీష్ రావు బిజెపిలోకి వెళ్లి ఎందుకు సిద్ధమవుతున్నారని.... అందుకే కేటీఆర్ ను తప్పించి.. హరీష్ రావుకు  పదవి ఆశ చూపిస్తున్నారని కేసీఆర్ ను ఎద్దేవా చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>