MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesb60c37e1-eedf-4eb4-b1fe-24b206da728a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesb60c37e1-eedf-4eb4-b1fe-24b206da728a-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో వీరిద్దరికి కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ movies{#}koratala siva;Goa;Sri Venkateshwara Creations;Janhvi Kapoor;thaman s;Rajahmundry;dil raju;Ram Charan Teja;GEUM;Pawan Kalyan;Oscar;Saif Ali Khan;Rajamouli;shankar;Music;Jr NTR;NTR;Cinema"ఆర్ఆర్ఆర్" హీరోల షూటింగ్ వివరాలు ఇవే..!"ఆర్ఆర్ఆర్" హీరోల షూటింగ్ వివరాలు ఇవే..!movies{#}koratala siva;Goa;Sri Venkateshwara Creations;Janhvi Kapoor;thaman s;Rajahmundry;dil raju;Ram Charan Teja;GEUM;Pawan Kalyan;Oscar;Saif Ali Khan;Rajamouli;shankar;Music;Jr NTR;NTR;CinemaTue, 11 Jun 2024 13:12:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో వీరిద్దరికి కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది . ఇక పోతే ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు . అందుకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామ్ చరణ్ మరియు మరి కొంత మంది ఇతరులపై రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమండ్రి షెడ్యూల్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృంద భారీ ప్రస్తుతం గోవా లో ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>