Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan95c254a8-7f13-4e18-b86d-cba4b432fb73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan95c254a8-7f13-4e18-b86d-cba4b432fb73-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు కేవలం పవర్ స్టార్ గా మాత్రమే కొనసాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా మారిపోయారు. తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా అధికారంలో ఉన్న వైసిపిని మించి ఇక ఎక్కువ స్థానంలో విజయం సాధించి.. ఏకంగా ప్రతిపక్ష హోదాను దక్కించుకునే స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఇలా అఖండ విజయాన్ని సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదైతే కావాలని కPawan{#}Deputy Chief Minister;pithapuram;Service;Pawan Kalyan;Janasena;Assembly;kalyan;Minister;CBNఫ్యాన్స్ కోరుకుందేంటి.. పవన్ చేస్తుందేంటి.. వాళ్ళకి షాక్ తప్పదా?ఫ్యాన్స్ కోరుకుందేంటి.. పవన్ చేస్తుందేంటి.. వాళ్ళకి షాక్ తప్పదా?Pawan{#}Deputy Chief Minister;pithapuram;Service;Pawan Kalyan;Janasena;Assembly;kalyan;Minister;CBNTue, 11 Jun 2024 20:15:00 GMTమొన్నటి వరకు కేవలం పవర్ స్టార్ గా మాత్రమే కొనసాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇక ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా మారిపోయారు. తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా అధికారంలో ఉన్న వైసిపిని మించి ఇక ఎక్కువ స్థానంలో విజయం సాధించి.. ఏకంగా ప్రతిపక్ష హోదాను దక్కించుకునే స్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.


 అయితే పవన్ కళ్యాణ్ ఇలా అఖండ విజయాన్ని సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదైతే కావాలని కోరుకున్నామో.. ఇన్నాళ్లకు అదే జరిగింది అంటూ అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రజా సేవ చేస్తూనే ఇంకోవైపు సినిమాలను కూడా చేస్తారని అభిమానులు ఊహించారు. కానీ అభిమానులు ఒకటి ఊహిస్తే అటు పవన్ కళ్యాణ్ మాత్రం మరొకటి చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది  రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అటు పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకే కేటాయించబోతున్నట్లు సమాచారం.


 ఇటీవలే పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ తరఫున 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు కీలకమైన బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. అయితే ఒక పార్టీకి శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్న నేత పూర్తిస్థాయిలో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా కచ్చితంగా ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు అందరిని కూడా సమన్వయ పరుస్తూ ఉండాలి. దీంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ బాధ్యతలను బట్టి చూస్తే ఇక ఆయన పూర్తిస్థాయి రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలు చేసే అవకాశం తక్కువగానే ఉంది అన్నది తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వంలో పవన్  డిప్యూటీ సీఎం లేదంటే కీలక శాఖకు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండడంతో ఇక పవన్ సినిమాలకు ఏ క్షణంలో గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎంతోమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>