PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-cbn-tdp-ycp-ntr-ap7fb84649-ec41-44c4-8944-5979af52dcc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh-cbn-tdp-ycp-ntr-ap7fb84649-ec41-44c4-8944-5979af52dcc9-415x250-IndiaHerald.jpgదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. మరి ఈ సామెత ఎందుకు చెప్పారో ఏమో కానీ ఈ సామెత చంద్రబాబు కుమారుడు లోకేష్ కు పక్కా సూట్ అవుతుంది. 2019లో టిడిపి ఓడిపోయిన సమయంలో వైసీపీ బ్యాచ్ అంతా కలిసి ఓ వైపు చంద్రబాబును మరోవైపు లోకేష్ ను చాలా చీప్ గా చూశారు. లోకేష్ ను పప్పు అంటూ సంభోదించారు. ఇక చంద్రబాబు ముసలోడు అయిపోయారు, టిడిపి చచ్చిపోయింది అని కూడా కామెంట్స్ చేశారు. ఇలా ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు చూసినటువంటి టిడిపి పడి లేచిన కెరటంలా మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి అధికారంలోకి రlokesh;cbn;tdp;ycp;ntr;ap{#}Shakti;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;Fire;YCP;Father;NTR;CBN;Andhra Pradesh;TDP;Minister;Houseలోకేష్ ఆ తప్పు చేయొద్దు.. టిడిపి బ్రతకాలంటే ఇలా ఉండాల్సిందే.?లోకేష్ ఆ తప్పు చేయొద్దు.. టిడిపి బ్రతకాలంటే ఇలా ఉండాల్సిందే.?lokesh;cbn;tdp;ycp;ntr;ap{#}Shakti;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;Fire;YCP;Father;NTR;CBN;Andhra Pradesh;TDP;Minister;HouseTue, 11 Jun 2024 10:38:00 GMT దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు.  మరి ఈ సామెత ఎందుకు చెప్పారో ఏమో కానీ ఈ సామెత చంద్రబాబు కుమారుడు లోకేష్ కు పక్కా సూట్ అవుతుంది. 2019లో టిడిపి ఓడిపోయిన సమయంలో వైసీపీ బ్యాచ్ అంతా కలిసి  ఓ వైపు చంద్రబాబును మరోవైపు లోకేష్ ను చాలా చీప్ గా చూశారు. లోకేష్ ను పప్పు అంటూ సంభోదించారు. ఇక చంద్రబాబు ముసలోడు అయిపోయారు, టిడిపి చచ్చిపోయింది అని కూడా కామెంట్స్ చేశారు. ఇలా ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు  చూసినటువంటి టిడిపి పడి లేచిన కెరటంలా మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి అధికారంలోకి రావడం లోకేష్ గొప్ప ఛాన్స్ అని చెప్పవచ్చు. అలాంటి లోకేష్ ఈసారి దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో టిడిపిని బ్రతికిస్తారా? లేదంటే  అధికారం మనదే కదా అని సైలెంట్ గా కూర్చుంటారా.? లోకేష్ ముందున్న సవాళ్లు ఏంటి.? అనే వివరాలు చూద్దాం.. 

టిడిపి పార్టీని సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఎప్పుడైతే చంద్రబాబు కైవసం చేసుకున్నారో అప్పటినుంచి పార్టీని కాపాడుకుంటూ తాను కూడా ప్రజల్లో ఎదుగుతూ వచ్చారు. అలాంటి ఈ పార్టీని నెక్స్ట్ కాపాడబోయేది లోకేష్ మాత్రమే.  అలాంటి ఈ తరుణంలో ఆయన ఇప్పుడు ఇచ్చే మంత్రివర్గంలో పదవుల గురించి కొట్లాడకుండా రాబోవు రోజుల్లో పార్టీని తన చేతిలోకి తీసుకోవాలనే విషయాలపై ఆలోచన చేయాలి.  ముఖ్యంగా  లోకేష్ కేవలం మంగళగిరి నియోజకవర్గం కాకుండా ఉన్న అన్ని నియోజకవర్గాలను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు నియోజకవర్గాలకు పునర్విభజన జరగబోతుంది కాబట్టి  175 నియోజకవర్గాల నుంచి దాదాపు 225 నియోజకవర్గాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. ఏపీ మొత్తం తన కంట్రోల్లో ఉండే విధంగా తన వైపుకు తిప్పుకోవాలి.

 అంతేకాకుండా వైసిపి పాలనలో కార్యకర్తలపై ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  వారందరికీ ఇక నేనున్నానని భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో  కార్యకర్తలకు మంచి ప్రోత్సాహం అందించాలి. ఎవరైతే తనను పప్పు అన్నారో వాళ్ళందరి ముందు తాను నిప్పు అని నిరూపించుకోవాలి. ప్రస్తుతం ఇచ్చే మంత్రివర్గంలో చోటు కోరుకోకుండా,  ఎక్కడ ఏ మంత్రి నియమించాలి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని ఆ దానిపై లోకేష్ ఆలోచన చేసి వారందరినీ  తన గుప్పిట్లో పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా తన తండ్రి చంద్రబాబుకు  ఇక నేను లేకున్నా నా కొడుకు నడిపిస్తాడు అనే ఆలోచన  వచ్చేలా చేయాలి. ఈ విధంగా లోకేష్  ఎలాంటి మంత్రి పదవులు ఆశించకుండా ఉన్న వాళ్లందరికీ బాధ్యతలు అప్పగించి తాను వారందరినీ లీడ్ చేసే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ అంటే ఏంటో నిరూపించుకొని టిడిపి భవిష్యత్తులో కాపాడే శక్తి ఉందని  అనిపించుకునే ప్రయత్నాలు చేయాలని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>