PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attack-the-centre-kcr-orders-the-mps84b108fb-af43-4cee-97ec-0e2fb047b19c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attack-the-centre-kcr-orders-the-mps84b108fb-af43-4cee-97ec-0e2fb047b19c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కమలదళం పనిచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని భావించింది. 2019లో 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన బిజెపి తాజాగా ఆ సీట్లను 8కి పెంచుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. bjp{#}Warangal;Nalgonda;nagarkurnool;Mahabubabad;Adilabad;Nayak;Zahirabad;Khammam;March;madhavi;Hyderabad;srinivas;MLA;Parliment;lotus;politics;Party;Telangana;MP;Bharatiya Janata Partyకేసీఆర్ దెబ్బకు కుదేలైన బీజేపీ పార్టీ ?కేసీఆర్ దెబ్బకు కుదేలైన బీజేపీ పార్టీ ?bjp{#}Warangal;Nalgonda;nagarkurnool;Mahabubabad;Adilabad;Nayak;Zahirabad;Khammam;March;madhavi;Hyderabad;srinivas;MLA;Parliment;lotus;politics;Party;Telangana;MP;Bharatiya Janata PartyTue, 11 Jun 2024 07:35:20 GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కమలదళం పనిచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని భావించింది. 2019లో 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన బిజెపి తాజాగా ఆ సీట్లను 8కి పెంచుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.


పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ హై కమాండ్ కొత్త ముఖాలకి లోక్ సభ టికెట్ ఇచ్చి రంగంలోకి దింపింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకి నెల రోజుల ముందు జాయిన్ అయిన వారికి టికెట్ ఇచ్చింది. తొమ్మిది మంది కొత్తవారిని బరిలోకి దింపింది. వీరంతా కూడా టికెట్ కోసమే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కమలం గుర్తు మీద పోటీ చేస్తే గెలవచ్చన్న నమ్మకంతోనే పార్టీలోకి చేరారు. పార్టీ కూడా పాతవారు కాకుండా కొత్తగా చేరిన వారిని పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించింది.


కానీ వారు ఊహించినట్టు జరగలేదు. ఓటర్లు మరో రకమైన తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీ చేశారు. నాగర్ కర్నూల్ నుంచి భరత్, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ బరిలోకి దిగారు. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఖమ్మం నుంచి వినోద్ రావు, నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బరిలో ఉన్నారు.


హైదరాబాద్ నుంచి మాధవి లత, ఆదిలాబాద్ నుంచి గూడెం నగేష్ కాంటెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఒక్క ఆదిలాబాద్ లో తప్ప మిగతా చోట్ల ఆదరించలేదు. బిజెపి అధిష్టానం చేసిన ప్రయోగం సఫలం కాలేదు. గత కొన్నేళ్లుగా బిజెపిలో ఉన్న వారికే ప్రజలు ఓటు వేశారు. ఇందులో ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను మార్చి ఉంటే కాషాయ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే ఇందులో ఎక్కువ మంది నేతలు కేసీఆర్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరి ఓడిన వారే కావడం గమనార్హం. దీంతో బీజేపీ పార్టీ ఇలా కేసీఆర్‌ ఇలా దెబ్బకొట్టాడని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>