PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp554292d7-c684-424c-af7d-5bd646cc3304-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp554292d7-c684-424c-af7d-5bd646cc3304-415x250-IndiaHerald.jpgటిడిపి పార్టీ 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వైసిపి నేతలను టార్గెట్ చేసే విధంగా టిడిపి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు కాస్త ఓవర్ చేశారని వార్తలు కూడా వినిపించాయి.. ముఖ్యంగా మాజీ మంత్రులు కొడాలి నాని.. పేర్ని నాని, బెల్లంపల్లి శ్రీనివాసు, జోగి రమేష్ తో పాటు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఉన్నారని టిడిపి నేతలు ఇప్పటికే తెలియజేశారు. వారు మాట్లాడిన మాటలే అందుకు కారణమని విధంగా చర్TDP;YCP{#}vamsi;JOGI RAMESH;devineni avinash;Perni Nani;Undavalli;Kodali Nani;News;TDP;CBN;YCP;Partyటీడీపి: ప్లాన్ ప్రకారం ఆనేతలపై.. ప్రతికారం తీర్చుకుంటోందా..?టీడీపి: ప్లాన్ ప్రకారం ఆనేతలపై.. ప్రతికారం తీర్చుకుంటోందా..?TDP;YCP{#}vamsi;JOGI RAMESH;devineni avinash;Perni Nani;Undavalli;Kodali Nani;News;TDP;CBN;YCP;PartyTue, 11 Jun 2024 08:08:00 GMTటిడిపి పార్టీ 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వైసిపి నేతలను టార్గెట్ చేసే విధంగా టిడిపి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు కాస్త ఓవర్ చేశారని వార్తలు కూడా వినిపించాయి.. ముఖ్యంగా మాజీ మంత్రులు కొడాలి నాని.. పేర్ని నాని, బెల్లంపల్లి శ్రీనివాసు, జోగి రమేష్ తో పాటు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఉన్నారని టిడిపి నేతలు ఇప్పటికే తెలియజేశారు. వారు మాట్లాడిన మాటలే అందుకు కారణమని విధంగా చర్చలు నడుస్తున్నాయి.



వైసిపి పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఈ నేతలందరూ కూడా చెలరేగిపోయారని నోటికి ఏమి వస్తే అది మాట్లాడారని తమ నేతలను చాలా దారుణంగా తిట్టారని టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. వ్యక్తిగత అంశాలు మొదలు రాజకీయాలలో అన్నిటిలో కూడా వ్యవహరించి ఇబ్బంది పెట్టారని కసిగా ఉన్న టిడిపి క్యాడర్ ఒక్కొక్కరిని చూసి టార్గెట్ చేయాలని చూస్తున్నట్లుగా భావిస్తోందట. ముఖ్యంగా కొడాలి నాని, వంశీ టాప్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరూ టిడిపి నుంచి రాజకీయంగా ఎదిగి వైసిపి పార్టీ అధికారంలోకి చంద్రబాబు మీదికే వీరుచుకుపడ్డారు.


ఇదే టిడిపి క్యాడర్ కి ప్రధాన కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కొడాలి నాని టిడిపి పార్టీకి కొరకరాని కోయిగా మారారు. చంద్రబాబు లోకేష్లను తీవ్రంగా విమర్శించారు.. వంశి అంతకుమించి కుటుంబ సభ్యులను మాట్లాడి పూర్తిగా పరిధి దాటారు అనే అభిప్రాయం కూడా పలువురు నేతలను వినిపిస్తోంది. మొదట ఈ ఇద్దరిని ఓడించాలని లక్ష్యంగా పెట్టు టిడిపి పార్టీ.. ఇప్పుడు ఆ టార్గెట్ ను సైతం రీచ్ అయ్యారు. దీంతో మరింత ఉత్సాహంతో దూసుకుపోయేలా ప్లాన్ చేస్తున్నారు టిడిపి నేతలు.. ఇప్పటికే కొడాలి నాని వంశీ ఇళ్ల పైన కూడా దాడులు చేయడం జరిగింది. ఇవి మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉండవల్లిలో ఉన్న టిడిపి చంద్రబాబు నాయుడు ఇంటి మీదికి ఉండవల్లి దండయాత్రకి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన జోగి రమేష్ ఎప్పుడు తనమీద దాడి జరుగుతుందని విధంగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి ప్రధాన కార్యాలయం పైన దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వించిన దేవినేని అవినాష్ పైన కూడా టిడిపి క్యాడర్ కోపంగానే ఉన్నట్లు సమాచారం. పేర్ని నాని పవన్ పైన తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం.. వీరి పైన కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>