PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/odishas-booster-dose-for-nda08a3310f-a109-4fe3-ae0b-2983bb87c2ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/odishas-booster-dose-for-nda08a3310f-a109-4fe3-ae0b-2983bb87c2ad-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో టీడీపీ ఘోర పరాజయానికి 2024లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అప్పుడు టీడీపీ కానీ గత ఐదేళ్లలో వైసీపీ కానీ ఓటర్ల మనస్సులను గెలుచుకోవడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమిని 164 స్థానాల్లో గెలిపించుకోవడంతో చంద్రబాబును మించిన అదృష్టవంతుడు ఎవరూ ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు. chandrababu{#}Chakram;YCP;Narendra Modi;TDP;CBN;Andhra Pradeshవాళ్ల నమ్మకాన్ని బాబు నిలబెట్టుకుంటే చాలు.. మరో 30 ఏళ్లు టీడీపీకి తిరుగుండదా?వాళ్ల నమ్మకాన్ని బాబు నిలబెట్టుకుంటే చాలు.. మరో 30 ఏళ్లు టీడీపీకి తిరుగుండదా?chandrababu{#}Chakram;YCP;Narendra Modi;TDP;CBN;Andhra PradeshTue, 11 Jun 2024 10:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో టీడీపీ ఘోర పరాజయానికి 2024లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అప్పుడు టీడీపీ కానీ గత ఐదేళ్లలో వైసీపీ కానీ ఓటర్ల మనస్సులను గెలుచుకోవడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమిని 164 స్థానాల్లో గెలిపించుకోవడంతో చంద్రబాబును మించిన అదృష్టవంతుడు ఎవరూ ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు.
 
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల మనస్సులను గెలుచుకుంటే మరోవైపు చెప్పిన సమయానికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉండటం చంద్రబాబుకు సులువు కాదు. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన స్కీమ్స్ కు ఎలాంటి షరతులు ఉండబోతున్నాయో అనే చర్చ సైతం జరుగుతోంది. ఫ్రీ స్కీమ్స్ చెప్పిన విధంగా అమలు చేయడం సులువు కాదు.
 
చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల వల్ల ఏపీలో లబ్ధిదారుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల విధుల విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. వాలంటీర్ల వల్లే నష్టపోయామని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో ఆ తప్పులు చేయకుండా కూటమి నేతలు జాగ్రత్త పడాల్సి ఉంది.
 
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకుంటే మాత్రం యువత చంద్రబాబుకు సపోర్ట్ గా నిలబడే ఛాన్స్ ఉంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను చెప్పినట్టు అమలు చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటే చాలని మరో 30 ఏళ్లు టీడీపీకి తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఈ ఎన్నికల్లో గెలుపు విషయంలో కీలక పాత్ర పోషించాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.   బాబు, పవన్, మోదీ కలిస్తే తిరుగుండదని ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతుండటంతో ఏపీ ఓటర్లు ఎంతో సంతోషిస్తున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>