Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak31ed0a9c-ce08-4635-bbc9-4cebe0e1be8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak31ed0a9c-ce08-4635-bbc9-4cebe0e1be8a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న 2024 t20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది పాకిస్తాన్ జట్టు. కానీ ఎక్కడ అంచనాలను అందుకోలేక పోతుంది. చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది. మొదటి మ్యాచ్ లో అటు చిన్న టీం అయినా యూఎస్ఏ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన భారతతో జరిగిన పోరులోనూ విజయం సాధించలేకపోయింది. ఇలా వరుసగా రెండు పరాజయాలతో చివరికి సూపర్ 8 లో అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్ జట్టు సూపర్ 8 కి చేరుPak{#}Shoaib Akhtar;Parugu;Qualification;West Indies;ICC T20;Pakistan;Indiaఇక ఆ దేవుడే కాపాడాలి.. పాకిస్తాన్ మాజీ షాకింగ్ కామెంట్స్?ఇక ఆ దేవుడే కాపాడాలి.. పాకిస్తాన్ మాజీ షాకింగ్ కామెంట్స్?Pak{#}Shoaib Akhtar;Parugu;Qualification;West Indies;ICC T20;Pakistan;IndiaTue, 11 Jun 2024 11:00:00 GMTప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న 2024 t20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది పాకిస్తాన్ జట్టు. కానీ ఎక్కడ అంచనాలను అందుకోలేక పోతుంది. చెత్త  ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది. మొదటి మ్యాచ్ లో అటు చిన్న టీం అయినా యూఎస్ఏ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన  భారతతో జరిగిన పోరులోనూ విజయం సాధించలేకపోయింది. ఇలా వరుసగా రెండు పరాజయాలతో చివరికి సూపర్ 8 లో అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.


 పాకిస్తాన్ జట్టు సూపర్ 8 కి చేరుకోవాలి అంటే కేవలం ఆ జట్టు విజయాలపై కాదు ఇతర జట్ల గెలుపు ఓటముల పైన కూడా ఆధారపడి ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన చేస్తూ ఉండడం పై మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు. భారత్ చేతిలో ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. చాలా విషయాలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇది జట్టుకు నిజంగా బాధాకరం. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచి ఉండాల్సింది. బంతికో పరుగు చేయాల్సిన స్థితిలో కూడా జట్టు విజయం అందుకోకపోవడం నిజంగా దారుణం .

47 బంతులు 46 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కూడా చేతిలో ఏడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ ఫలితం పై నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు.  ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ మొత్తం బాధలో మునిగిపోయింది. వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని.. ఆట ప్రారంభంలోనే చెప్పాను. ఒకరి కోసం ఒకరు ఆడాలని దేశం కోసం ఆడాలని చెప్పాను. ఈ మ్యాచ్లో గెలవాలనే పట్టుదల పాకిస్తాన్ లో ఎక్కడ కనిపించలేదు. కేవలం వ్యక్తిగత మైలురాళ్ల కోసం మాత్రమే ఆటగాళ్లు ఆడినట్లు కనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సూపర్ 8 కి అర్హత సాధిస్తుందో లేదో అనేది సందేహంగా మారింది.  ఆ దేవుడికి మాత్రమే తెలుసు అంటూ షోయబ్ అక్తర్ బావోద్వేగానికి గురయ్యాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>