Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcd9ac06-ef6c-41a2-b6c6-8d9228239cac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefcd9ac06-ef6c-41a2-b6c6-8d9228239cac-415x250-IndiaHerald.jpgకిరణ్ భీమవరం దర్శకత్వంలో ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.ఇదిలా ఉండగా..దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అందుకే ఎన్నో రకాల ప్రయోగాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.అందులో హర్రర్ కాన్సెప్టsocialstars lifestyle{#}ravi anchor;Bhimavaram;sirish;m m keeravani;king;Horror;Chaitanya;Oscar;Thriller;Love Story;kushi;naga;kiran;June;Cinemaరిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆహా లో స్ట్రీమింగ్ కానున్న "లవ్ మీ"..!!రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆహా లో స్ట్రీమింగ్ కానున్న "లవ్ మీ"..!!socialstars lifestyle{#}ravi anchor;Bhimavaram;sirish;m m keeravani;king;Horror;Chaitanya;Oscar;Thriller;Love Story;kushi;naga;kiran;June;CinemaTue, 11 Jun 2024 12:15:00 GMTకిరణ్ భీమవరం దర్శకత్వంలో ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇందులో సిమ్రన్ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.ఇదిలా ఉండగా..దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అందుకే ఎన్నో రకాల ప్రయోగాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.అందులో హర్రర్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలకు మరింత ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో అదే తరహా సినిమాలు మరింతగా వస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన హర్రర్ సినిమానే 'లవ్ మీ'.దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ నటించిన హర్రర్ సినిమానే 'లవ్ మీ'. కిరణ్ భీమవరం రూపొందించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ హర్రర్ అండ్ లవ్ స్టోరీ మూవీ మే 25వ తేదీన చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

దెయ్యం ప్రేమకథ అనే విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ మీ' మూవీకి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇది ఆశించిన రీతిలో ఓపెనింగ్స్‌ను వసూలు చేయలేదు. అయితే, ఆ తర్వాత మాత్రం ఈ సినిమా క్రమంగా డౌన్ అయింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే రన్‌ను ముగించింది. దీంతో ఈ చిత్రానికి నష్టాలు వచ్చాయి.ఆశీష్ హీరోగా నటించిన 'లవ్ మీ' సినిమాపై ఆరంభంలోనే హైప్ బాగా ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు అన్నీ బాగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఇది భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై మరో న్యూస్ లీకైంది.ఆశీష్ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'లవ్ మీ' సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కాకపోవడంతో దీన్ని నెల రోజుల లోపే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని జూన్ 15వ తేదీ నుంచి ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో సినీ ప్రియులంతా ఖుషీ అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>