Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu429f1fc3-b1e3-4c74-8832-188d085af7fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu429f1fc3-b1e3-4c74-8832-188d085af7fc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. రాష్ట్రంలో తీవ్ర పోటీ తప్పదు అనుకున్న అందరికి ఏకంగా 164 సీట్లు సాధించి షాక్ ఇచ్చింది.రాష్ట్రంలో గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీకి ఈ సారి 11 సీట్లు రావడం ఆ పార్టీ నేతలంతా కంగు తిన్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. అధికారంలో వున్నప్పుడు టీడీపీ, జనసేనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఈసారి వైసీపీ పార్టీకి ఉండనుందని ఆ పార్#chandrababu{#}Srikakulam;Kamma;Backward Classes;Cabinet;Guntur;YCP;Andhra Pradesh;CBN;TDP;Party;Thota Chandrasekhar;central government;Bharatiya Janata Party;MP;Eveningఏపీ : ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..ఏపీ : ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..#chandrababu{#}Srikakulam;Kamma;Backward Classes;Cabinet;Guntur;YCP;Andhra Pradesh;CBN;TDP;Party;Thota Chandrasekhar;central government;Bharatiya Janata Party;MP;EveningMon, 10 Jun 2024 17:03:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. రాష్ట్రంలో తీవ్ర పోటీ తప్పదు అనుకున్న అందరికి ఏకంగా 164 సీట్లు సాధించి షాక్ ఇచ్చింది.రాష్ట్రంలో గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీకి ఈ సారి 11 సీట్లు రావడం ఆ పార్టీ నేతలంతా కంగు తిన్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. అధికారంలో వున్నప్పుడు టీడీపీ, జనసేనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఈసారి వైసీపీ పార్టీకి ఉండనుందని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వణికి పోతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. నిన్న సాయంత్రం మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసారు.మోడీతో పాటుగా 30మంది ఎన్డీయే కూటమి ఎంపీలు కూడా ప్రమాణం చేసారు.. ఈ 30మందిలో ఇద్దరు ఏపీ ఎంపీలకు కూడా అవకాశం దక్కింది.

టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలుపొందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది.రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ శాఖ మంత్రిగా చోటు దక్కింది.ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీనే రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.నిన్న సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసారు.అయితే రాష్ట్రంలో బీసీ అయిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి వచ్చేలా చేసి చంద్రబాబు బీసీ సామాజిక వర్గానికి మేలు కలిగేలా చేసారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానికి మొదటి సారి ఎంపీ గా గెలిచినా కూడా కేంద్ర సహాయ మంత్రిని కట్టబెట్టారు. చంద్రబాబు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరిచేత ప్రశంసలు కురిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>