PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-lokesh-mangalagiri-poleti-raj-kumar199d931e-8915-4457-ad16-8b1bdf5d577d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-lokesh-mangalagiri-poleti-raj-kumar199d931e-8915-4457-ad16-8b1bdf5d577d-415x250-IndiaHerald.jpgఎక్కడైనా ఎప్పుడైనా అధికారమనేది అహంకారంగా మారితే కాలం క్షమించదు అనేది జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వైసిపి నాయకులు టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు. చివరికి కొంతమంది వైసిపి నాయకులు చంద్రబాబును అతని భార్యను కూడా తిట్టిపోసుకున్నారు. అలా టిడిపి కార్యకర్తలను ఐదు సంవత్సరాలు ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. వచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధి కోసం వాడుకోకుండా ఇలా అహంకార ప్రతీకార దాడుల కింద వాడుకోవడంతో వైసిపి పార్టీకి ఈ ఎనTDP;LOKESH;MANGALAGIRI;POLETI RAJ KUMAR{#}Y. S. Rajasekhara Reddy;Wife;Raaj Kumar;TDP;Jagan;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;YCP;Partyటిడిపి గెలుపు: అధికారం అహంకారంగా మారుతోందా..?టిడిపి గెలుపు: అధికారం అహంకారంగా మారుతోందా..?TDP;LOKESH;MANGALAGIRI;POLETI RAJ KUMAR{#}Y. S. Rajasekhara Reddy;Wife;Raaj Kumar;TDP;Jagan;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;YCP;PartyMon, 10 Jun 2024 14:16:00 GMTఎక్కడైనా ఎప్పుడైనా  అధికారమనేది అహంకారంగా మారితే  కాలం క్షమించదు అనేది జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  చాలామంది వైసిపి నాయకులు  టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు. చివరికి కొంతమంది వైసిపి  నాయకులు చంద్రబాబును అతని భార్యను కూడా తిట్టిపోసుకున్నారు. అలా టిడిపి కార్యకర్తలను ఐదు సంవత్సరాలు ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.  వచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధి కోసం వాడుకోకుండా ఇలా అహంకార ప్రతీకార దాడుల కింద వాడుకోవడంతో వైసిపి పార్టీకి  ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. దాని నుంచి వారు ఈసారి గుణపాఠం నేర్చుకున్నారు అని చెప్పవచ్చు.

 ఆ విధంగానే టిడిపి అధికారంలోకి వచ్చింది. మరి వీరు కూడా వైసిపి నాయకుల మాదిరిగానే  దాడులు చిత్రహింసలకు పాల్పడితే మాత్రం పార్టీ పరువు పోవడం ఖాయం. ఆనాడు జగన్ పార్టీ నాయకులు ఏ విధంగా చేసి ఈరోజు పతనమయ్యారో, టిడిపి నాయకులు కూడా ఆ విధంగానే రాబోవు రోజుల్లో పతనమవుతారు. కాబట్టి అధికారం రాగానే అహంకార పూరిత ప్రతికార దాడులను మానుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  అయితే తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడిలో జరిగినటువంటి ఒక ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  వైసిపి కార్యకర్త పోలేటి రాజకుమార్ ను టిడిపి నాయకులు చుట్టుముట్టి బట్టలూడదీసి అతన్ని రోడ్డుపై కూర్చోబెట్టారు.  చివరికి లోకేష్ బ్యానర్ పట్టుకొని  అతనితో క్షమాపణ చెప్పించారు.

అంతేకాకుండా కాళ్లు కూడా పట్టుకుంటాను వదిలేయమని ఆ కార్యకర్తలతో అనిపించారు. పాలేటి రాజ్ కుమార్ మరియు అతని భార్య కృష్ణవేణి ఇద్దరూ కలిసి  వైసిపికి పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో  వారి ఫోటోలను పెడుతూ పార్టీకి పనిచేశారు. కానీ పార్టీ ఓడిపోవడంతో టిడిపి తమ్ముళ్లకు కోపం వచ్చినట్టుంది. వెంటనే రాజ్ కుమార్ పై ప్రతీకార దాడులకు పాల్పడి  బట్టలు ఊడదీసి మోకాళ్లపై కూర్చోబెట్టి సారీ చెప్పించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడంతో అధికారం రాగానే అహంకారం పెరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఈ వీడియో చూసి. దీనిపై టిడిపి క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>