Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle90f28b49-5184-4451-8a50-0e572afc1576-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle90f28b49-5184-4451-8a50-0e572afc1576-415x250-IndiaHerald.jpgమాములుగా ఎంత పెద్ద స్టార్ అయినా ఆరు పదుల వయసు దాటాక శక్తి తగ్గడంతో పాటు రిస్కులు గట్రా మానేయడం కనిపిస్తుంది. కొత్త తరంతో పోటీ పడలేక వెనుకబడే వారు ఎందరో.కానీ టాలీవుడ్ సీనియర్లు మాత్రం కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. అందులో బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజు జూన్ 10 ఆయన పుట్టినరోజు సందర్భాన్ని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. ముచ్చటగా మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న సందర్భంతో పాటు ఇద్దరు అల్లుళ్ళు ప్రజా ప్రతినిధులుగా గెలవడం మరో ఘట్టం.దర్శకుడు బోయsocialstars lifestyle{#}Pooja Hegde;boyapati srinu;sithara;Kesari;Hindupuram;Shakti;Blockbuster hit;ramoji rao;Party;Tollywood;Josh;Bobby;Balakrishna;Cinema;Telugu;Juneవయసుతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న బాలయ్య..!!వయసుతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న బాలయ్య..!!socialstars lifestyle{#}Pooja Hegde;boyapati srinu;sithara;Kesari;Hindupuram;Shakti;Blockbuster hit;ramoji rao;Party;Tollywood;Josh;Bobby;Balakrishna;Cinema;Telugu;JuneMon, 10 Jun 2024 14:30:00 GMTమాములుగా ఎంత పెద్ద స్టార్ అయినా ఆరు పదుల వయసు దాటాక శక్తి తగ్గడంతో పాటు రిస్కులు గట్రా మానేయడం కనిపిస్తుంది. కొత్త తరంతో పోటీ పడలేక వెనుకబడే వారు ఎందరో.కానీ టాలీవుడ్ సీనియర్లు మాత్రం కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు. అందులో బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజు జూన్ 10 ఆయన పుట్టినరోజు సందర్భాన్ని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. ముచ్చటగా మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న సందర్భంతో పాటు ఇద్దరు అల్లుళ్ళు ప్రజా ప్రతినిధులుగా గెలవడం మరో ఘట్టం.దర్శకుడు బోయపాటి శీనుతో చేయబోయే నాలుగో బ్లాక్ బస్టర్ కు ఇవాళే శ్రీకారం చుట్టారు. అధికారిక ప్రకటన ఇచ్చారు కానీ రామోజీరావు అకాల మరణం దృష్ట్యా సంతాప దినాల నేపథ్యంలో పూజా కార్యక్రమం వాయిదా వేశారు. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ బాబీ దర్శకత్వంలో తీస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తాలుకు టైటిల్ రివీల్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. వీరమాస్ అనే పేరు ఆల్రెడీ లీకు రూపంలో తిరుగుతోంది. రెండో కూతురు తేజస్వినిని సమర్పకురాలిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ తో పాటు బోయపాటి శీను సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మార్చబోతున్నారు.ఇంకోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 4కి రంగం సిద్ధమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా సరికొత్త హోదాలో బాలయ్య చేయబోయే సందడికి భారీ సెలబ్రిటీలు వస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. మూడు ఫ్లాపుల తర్వాత డీలాపడిన అభిమానులకు జోష్ ఇస్తూ వరసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి రూపంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్యాన్స్ లో కొత్త ఊపొచ్చింది. తాతమ్మ కలతో మొదలుపెట్టి ఇప్పటిదాకా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట ప్రస్థానంలో నందమూరి వారసుడిగా బాలయ్య జోరు చూస్తుంటే ఆయన పాతుతున్న మైలురాళ్లుకు ఇది ప్రారంభమే అనిపిస్తుంది.ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. త్వరలో తన లక్కీ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కెరీర్లో, సేవా కార్యక్రమాల్లో, ప్రజా ప్రతినిధిగా బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది 'టీమ్ తెలుగు బులెటిన్'.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>