PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhavi-the-giant-killer-who-defeated-rajini-will-become-a-minister713d4c9c-30f5-4338-8248-3cddf7249bc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/madhavi-the-giant-killer-who-defeated-rajini-will-become-a-minister713d4c9c-30f5-4338-8248-3cddf7249bc3-415x250-IndiaHerald.jpg- బీసీ + మ‌హిళా కోటాలో ల‌క్కీ ఛాన్స్ ద‌క్కేనా ? - ఉమ్మ‌డి గుంటూరు ఈక్వేష‌న్లు మాధ‌వికి క‌లిసొస్తాయా ? ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి బాబు క్యాబినెట్ కూర్పు ఎలా ? ఉంటుంది.. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణలు అటు బీజేపీ, జనసేన నుంచి ఎవరెవరిని క్యాబినెట్‌లో తీసుకుంటారు.. తెలుగుదేశం నుంచి ఎక్కువమంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chandrababu; tdp; Madhavi; Rajini{#}Piduguralla;madhavi;Nadendla Manohar;Guntur;Backward Classes;Lokesh;Lokesh Kanagaraj;Mangalagiri;Nara Lokesh;Assembly;Telugu Desam Party;India;YCP;CBN;Kamma;Janasena;Cabinet;Minister;Partyర‌జ‌నీని ఓడించిన జెయింట్ కిల్ల‌ర్ మాధ‌వికి మంత్రి ప‌ద‌వా..?ర‌జ‌నీని ఓడించిన జెయింట్ కిల్ల‌ర్ మాధ‌వికి మంత్రి ప‌ద‌వా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chandrababu; tdp; Madhavi; Rajini{#}Piduguralla;madhavi;Nadendla Manohar;Guntur;Backward Classes;Lokesh;Lokesh Kanagaraj;Mangalagiri;Nara Lokesh;Assembly;Telugu Desam Party;India;YCP;CBN;Kamma;Janasena;Cabinet;Minister;PartyMon, 10 Jun 2024 08:18:00 GMT- బీసీ + మ‌హిళా కోటాలో ల‌క్కీ ఛాన్స్ ద‌క్కేనా ?
- ఉమ్మ‌డి గుంటూరు ఈక్వేష‌న్లు మాధ‌వికి క‌లిసొస్తాయా  ?

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి బాబు క్యాబినెట్ కూర్పు ఎలా ? ఉంటుంది.. సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణలు అటు బీజేపీ, జనసేన నుంచి ఎవరెవరిని క్యాబినెట్‌లో తీసుకుంటారు.. తెలుగుదేశం నుంచి ఎక్కువమంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో ఎవరెవరు క్యాబినెట్ లోకి వస్తారు.. అన్నది కూడా ఉత్కంఠ గా మారింది. ఇక బీసీ సామాజిక వర్గాల నుంచి ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. ఈసారి క్యాబినెట్‌లో యువతకు ఎక్కువ‌ ఛాన్సులు ఉండబోతున్నాయి. క్యాబినెట్ కూర్పు పై లోకేష్ ముద్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.


బీసీల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా నేత పిడుగురాళ్ల మాధవి పేరు కూడా చర్చలోకి వస్తోంది. మాధవి బీసీల్లో బాగా వెనుకబడిన రజక సామాజిక‌ వర్గానికి చెందినవారు. ఆమె తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి.. వైసీపీ నుంచి పోటీ చేసి ఆ పార్టీ మహిళా మంత్రి విడుదల రజనీపై ఏకంగా 50వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. బీసీల్లో వెనుకబడిన రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం.. ఇప్పటివరకు ఆ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి లేకపోవటం.. పైగా మహిళా కోటాతో పాటు యువకురాలు కావడంతో ఈ సమీకరణలు అన్నీ ఆమెకు కలిసి రానున్నాయి.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కోటాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ కు మంత్రి పదవి ఖరారు అయింది. అలాగే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ కి కూడా కీలకమైన శాఖ కేటాయిస్తారని అంటున్నారు. లోకేష్ కూడా కమ్మ వర్గానికి చెందిన నేత అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాధవికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే అటు మహిళా కోటాతో పాటు ఇటు బీసీ కోటా భర్తీ అయినట్టు అవుతుందన్న ఆలోచనతో చంద్రబాబు.. లోకేష్, మాధవి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా విడ‌దల రజనీలాంటి మంత్రిని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచిన మాధవి.. ఇప్పుడు క్యాబినెట్ పదవి కూడా సొంతం చేసుకుంటే.. ఆమె సంచలనం క్రియేట్ చేసినట్టే అనుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>