MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-box-officeaeec47cb-acd7-4b94-a68a-a6b769e9c747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-box-officeaeec47cb-acd7-4b94-a68a-a6b769e9c747-415x250-IndiaHerald.jpgశర్వానంద్ 35వ చిత్రంగా 'మనమే' జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.ఇంకా అలాగే అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ 'క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా' ఈ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.‘మనమే’ విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ Tollywood Box Office{#}neha shetty;prasad;ramana;vivek;Posters;sriram;sithara;Heroine;producer;Producer;media;June;Cinema;Heroబాక్స్ ఆఫీస్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్లోని ఆపేసిన మనమే?బాక్స్ ఆఫీస్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్లోని ఆపేసిన మనమే?Tollywood Box Office{#}neha shetty;prasad;ramana;vivek;Posters;sriram;sithara;Heroine;producer;Producer;media;June;Cinema;HeroMon, 10 Jun 2024 18:18:00 GMTశర్వానంద్  35వ చిత్రంగా 'మనమే' జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.ఇంకా అలాగే అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ 'క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా' ఈ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా కృతి శెట్టి  నటించింది.‘మనమే’ విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం సో సో గానే వచ్చాయి.కానీ 2వ రోజు ఈ సినిమా బాగానే పికప్ అయ్యింది. 3వ రోజు ఇంకా బాగా కలెక్ట్ చేసింది.


ఇలా రోజు రోజుకి ఈ సినిమా గ్రోత్ బాగానే చూపిస్తుంది. ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే.. ‘మనమే’ మూవీకి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా మొత్తం రూ.4.89 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఖచ్చితంగా ఇంకా రూ.8.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా గ్రోత్ చూస్తుంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వచ్చేసింది.మరి చూడాలి ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో..


 ఈ సినిమా రాకతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వసూళ్లు తగ్గాయి. ఇప్పుడు ఆ సినిమా ఓటీటి విడుదలకి సిద్ధం అవుతుంది.ఈ సినిమా జూన్ 14న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>