PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-still-afraid-of-defeat-513db9bb-77ee-4d65-a69c-5e5d2b9d9d6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-still-afraid-of-defeat-513db9bb-77ee-4d65-a69c-5e5d2b9d9d6a-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత కుమారుడు నారా లోకేశ్ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన సమయంలో ఆయనపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. నారా లోకేశ్ మంగళగిరిలో ఎప్పటికీ గెలవలేరని టీడీపీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుని పోటీ చేస్తే మంచిదని కామెంట్లు వినిపించాయి. అయితే ఆ విమర్శలకు నారా లోకేశ్ మాటలతో కాకుండా చేతలతో గట్టిగా బదులివ్వడం గమనర్హం. nara lokesh{#}Nara Lokesh;CBN;News;Party;Ministerఓడిన చోటే గెలుపు.. రాళ్లు పడ్డ చోటే పూలు.. లోకేశ్ కష్టానికి విజయం దాసోహం!ఓడిన చోటే గెలుపు.. రాళ్లు పడ్డ చోటే పూలు.. లోకేశ్ కష్టానికి విజయం దాసోహం!nara lokesh{#}Nara Lokesh;CBN;News;Party;MinisterMon, 10 Jun 2024 10:22:00 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు  కుమారుడు నారా లోకేశ్ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన సమయంలో ఆయనపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. నారా లోకేశ్ మంగళగిరిలో ఎప్పటికీ గెలవలేరని టీడీపీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకుని పోటీ చేస్తే మంచిదని కామెంట్లు వినిపించాయి. అయితే ఆ విమర్శలకు నారా లోకేశ్ మాటలతో కాకుండా చేతలతో గట్టిగా బదులివ్వడం గమనర్హం.
 
ఓడిన చోటే నారా లోకేశ్ కు విజయం దక్కడంతో పాటు అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకునే స్థాయికి లోకేశ్ ఎదిగారు. లోకేశ్ కష్టానికి విజయం సైతం దాసోహం అయిందని ఈ ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది. 91 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరిలో లోకేశ్ కొత్త చరిత్రను లిఖించారు. మంగళగిరిలో గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మెజారిటీ అయితే రాలేదని సమాచారం అందుతోంది.
 
రికార్డులను తిరగరాస్తూ నారా లోకేశ్ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో లోకేశ్ కు స్థానం దక్కడం ఖాయం కాగా లోకేశ్ మాత్రం తనకు మంత్రివర్గంలో చోటు కంటే పార్టీ పరంగా బాధ్యతలు తీసుకోవడం ముఖ్యమని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మాత్రం లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు భోగట్టా.
 
గతంలో ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రిగా పని చేసిన నారా లోకేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఐటీ, ఆటోమొబైల్స్ కంపెనీలు ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించారు. ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకుంటున్న నారా లోకేశ్ భవిష్యత్తు రాజకీయాల్లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నారా లోకేశ్ కు దక్కే పదవికి సంబంధించి అతి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం నారా లోకేశ్ కు ఎంతో ప్లస్ అవుతోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>