PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/katasani-rambhupal-reddy-jagan-ycp103d64e6-c25e-418d-98d8-7befa429289d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/katasani-rambhupal-reddy-jagan-ycp103d64e6-c25e-418d-98d8-7befa429289d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టిడిపి పార్టీ కూటమిలో భాగంగా 164 సీట్లు గెలిచింది.. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో చాలా మంది నేతలు వైసిపి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను సైతం విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ అధికారులు తమ మాట విని ఉంటే వైసిపి పార్టీకి ఈ రోజున ఇలాంటి దుస్థితి వచ్చేది కాదంటూ కూడా వెల్లడించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామందిని ఇబ్బందులకKATASANI RAMBHUPAL REDDY.JAGAN;YCP{#}KATASANI RAMBHUPAL REDDY;Jagan;Yevaru;Andhra Pradesh;YCP;MLA;TDP;Ministerఏపీ: జగన్ పై వైసిపి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!ఏపీ: జగన్ పై వైసిపి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!KATASANI RAMBHUPAL REDDY.JAGAN;YCP{#}KATASANI RAMBHUPAL REDDY;Jagan;Yevaru;Andhra Pradesh;YCP;MLA;TDP;MinisterMon, 10 Jun 2024 06:46:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టిడిపి పార్టీ కూటమిలో భాగంగా 164 సీట్లు గెలిచింది.. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో చాలా మంది నేతలు వైసిపి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను సైతం విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ అధికారులు తమ మాట విని ఉంటే వైసిపి పార్టీకి ఈ రోజున ఇలాంటి దుస్థితి వచ్చేది కాదంటూ కూడా వెల్లడించారు


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామందిని ఇబ్బందులకు గురిచేసింది అంటూ కాటసాని తెలియజేశారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పామని కానీ ఎవరు ఈ విషయాన్ని వినలేదని తెలిపారు. అందుకే వైసిపి ఓటమి కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య కారణమని వెల్లడించారు. అంతేకాకుండా ఇసుక ,మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని ఒప్పుకున్నారు. రైతుల భూములను లాక్కుంటున్నారని ప్రచారం టిడిపి పెద్ద ఎత్తున చేసిందని వీటితో పాటు కొన్ని తప్పులు చేయడం వల్లే మేము ఓడిపోయామని వెల్లడించారు. అలాగే అధికారుల మాట కూడా వినివుంటే గెలిచే వాళ్ళమని తెలియజేశారు మాజీ మంత్రి కాటసాని..


లక్ష రూపాయలు రుణమాఫీ చొప్పమన్నా కూడా పరిస్థితి ఇలా ఉండేది కాదని వెల్లడించారు తాము నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే తప్పయితే తమని క్షమించాలని కూడా వెల్లడించారు..తాము ఎప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల కోసమే పోరాడుతూ ఉంటామని మాజీ నేత కాటసాని తెలియజేశారు.తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తమను ఓడించడం చాలా బాధాకరంగా ఉంది అంటూ వెల్లడించారు కానీ ప్రజల తీర్పును మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తానంటూ తెలియజేశారు వైసిపి సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ప్రస్తుతం ఈ నేత చేసిన వాక్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>