PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-ap-nirudyogulu-itbad8c73e-5e26-41f1-a447-4199069dc342-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-ap-nirudyogulu-itbad8c73e-5e26-41f1-a447-4199069dc342-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు దాదాపుగా రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు దాటింది. ఈ టైంలో ఆయన ఎన్నో సవాళ్లు,ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పథకాలు మరెన్నో రాజకీయ అనుభవాలు పొందారు. ఆయన రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్ మాజీ సీఎంకు జగన్ కు లేదు. అలాంటి గొప్ప నాయకున్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువగా అంచనా వేసి బోల్తాపడ్డాడు. అంతేకాదు వైసిపి హయాంలో చంద్రబాబు వయసుకు కూడా ఎవరూ గౌరవం ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు భార్యను కూడా తిట్టిపోసుకున్నారు. చివరికి ఆయన ఏడుపు కళ్ల చూశారు. ఎప్పుడైతే చంద్రబాబు తీవ్ర మనోవేదనకు గురయ్యారో అప్పుడCHANDRABABU;TDP;AP;NIRUDYOGULU;IT{#}king;King;un employment;Jagan;YCP;Andhra Pradesh;CBN;central government;Telangana Chief Minister;CM;Reddy;TDPవిజయంతో కూడిన సవాళ్లు: చంద్రబాబు నమ్మిన నిరుద్యోగులకు న్యాయం చేస్తాడా..?విజయంతో కూడిన సవాళ్లు: చంద్రబాబు నమ్మిన నిరుద్యోగులకు న్యాయం చేస్తాడా..?CHANDRABABU;TDP;AP;NIRUDYOGULU;IT{#}king;King;un employment;Jagan;YCP;Andhra Pradesh;CBN;central government;Telangana Chief Minister;CM;Reddy;TDPSun, 09 Jun 2024 09:10:00 GMT- కేంద్ర కింగ్ మేకర్ రాష్ట్రంలో కింగ్ అవుతారా.?
- నిరుద్యోగుల ఉద్యోగ బాధలు తీరుస్తారా..?
- చంద్రబాబు ముందున్న సవాళ్లు ఎలా ఎదుర్కొంటారో.?


 చంద్రబాబు నాయుడు దాదాపుగా రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు దాటింది. ఈ టైంలో ఆయన ఎన్నో సవాళ్లు,ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పథకాలు  మరెన్నో రాజకీయ  అనుభవాలు పొందారు. ఆయన రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్  మాజీ సీఎంకు జగన్ కు లేదు. అలాంటి గొప్ప నాయకున్ని  మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువగా అంచనా వేసి బోల్తాపడ్డాడు. అంతేకాదు వైసిపి హయాంలో చంద్రబాబు వయసుకు కూడా ఎవరూ గౌరవం ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు భార్యను కూడా తిట్టిపోసుకున్నారు. చివరికి ఆయన ఏడుపు కళ్ల చూశారు. ఎప్పుడైతే చంద్రబాబు తీవ్ర మనోవేదనకు గురయ్యారో అప్పుడే డిసైడ్ అయ్యారట. ఇక అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతానని శపథం చేశారు.  దానికి అనుగుణంగానే ప్రయత్నాలు చేసుకుంటూ చివరికి భారీ మెజారిటీతో  అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.  కనీసం ఆయనను ఏడిపించినటు వంటి వైసిపి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన గొప్ప రాజకీయవేత్త అని చెప్పవచ్చు. అయితే ఇన్నాళ్లు గెలుపోటముల కోసం పోరాడాడు. కానీ ప్రస్తుతం ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను వమ్ము చేయకుండా నిర్వర్తించాలి. అలా అయితేనే కలకాలం టిడిపి పార్టీ నిలబడుతుంది. చంద్రబాబు కూడా దాని కోసమే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతారట. అలాంటి చంద్రబాబు కు రాబోవు రోజుల్లో ముఖ్యమైన సవాళ్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

 యువతకు ఉద్యోగ కల్పన :
 దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందంటారు.  అలాంటి యువత సక్రమమైన మార్గంలో నడిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.  అలాంటిది చంద్రబాబును నమ్మి ఎంతోమంది నిరుద్యోగులు ఓట్లు వేశారు. ఆయన వస్తే ఉద్యోగ కల్పన ఉంటుందని భావించారు. ఆ విధంగానే చంద్రబాబు కూడా  ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం మెగా డీఎస్సీ పై మొదటి సంతకం పెడుతున్నారట. అంతేకాకుండా  ఐటీ డెవలప్మెంట్ లో మంచిపట్టున్న నిష్ణాతుడు చంద్రబాబు.అలాగే హైదరాబాదులో ఐటి ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కృషి చేశారు.  ప్రస్తుతం రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రాజధానిని డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా అక్కడికి కొత్త కొత్త కంపెనీలు తీసుకురావాలి ఐటీని డెవలప్ చేయాలి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని యువతకు  ప్రధానంగా ఉద్యోగాలు దొరుకుతాయి. దీంతో రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  రాజధానిని డెవలప్ చేస్తారట. ఐటీ కంపెనీలు తీసుకొస్తారట.  ఇక ఇవే కాకుండా మరెన్నో ప్రైవేట్ కంపెనీలు తీసుకువచ్చి  లక్షలాది మంది యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా  పెట్టుకున్నారట. మరి చూడాలి ఆయన ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారు యువతకు ఏ విధమైన భరోసా ఇస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>