MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cc09f3cb5d-08f7-4c62-af58-70054a9bee1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cc09f3cb5d-08f7-4c62-af58-70054a9bee1c-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల ద్వారా ఈ బ్యూటీ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె సుహాస్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ సినిమా అద్భుతంగా ఉండడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూcc{#}chandini chowdary;suhas;BEAUTY;Heroine;June;Beautiful;Cinema;Teluguవరుస సినిమాలతో దూసుకుపోతున్న చాందిని చౌదరి..!వరుస సినిమాలతో దూసుకుపోతున్న చాందిని చౌదరి..!cc{#}chandini chowdary;suhas;BEAUTY;Heroine;June;Beautiful;Cinema;TeluguSun, 09 Jun 2024 14:34:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల ద్వారా ఈ బ్యూటీ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు . అలాంటి సమయం లోనే ఈమె సుహాస్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ థియేటర్ల లో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అయింది.

ఇక ఈ సినిమా అద్భుతంగా ఉండడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమా పరిశ్రమల అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ గామి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.

తాజాగా చాందిని యేవ‌మ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఈ నటి మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇలా ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఈ నటికీ తెలుగు లో మరింత క్రేజ్ రావడం , ఆ తర్వాత మంచి సినిమాలలో అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం చాలా వరకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>