PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishaf86097ae-b0fa-4ffd-97d1-75b2f1f0f3e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishaf86097ae-b0fa-4ffd-97d1-75b2f1f0f3e2-415x250-IndiaHerald.jpgనందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ వారిలో ఎవరూ కూడా సక్సెస్ కాలేకపోయారు ఒక్క బాలకృష్ణ తప్ప. ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ అంతటి సక్సెస్ సాధించగలిగారు. అయితే తారక్ ఓన్లీ సినిమాల్లో మాత్రమే సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లో ఆయన పెద్దగా క్లీక్‌ అవ్వలేదు. నిజానికి ఇటువైపు రావడానికి ఆయనకు ఆసక్తి లేదు. అయితే నరసింహ నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాలోని కాకుండా రాజకీయంలో కూడా బాగా సక్సెస్ అయ్యారు. హిందూపురం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. balakrisha{#}Simha;Narasimha;Success;Father;Darsakudu;Jr NTR;Hindupuram;Balakrishna;Director;Venkatesh;Cinemaబాలయ్యా మజాకా.. రాజకీయాల్లోనే కాదు అక్కడ కూడా హ్యాట్రిక్..??బాలయ్యా మజాకా.. రాజకీయాల్లోనే కాదు అక్కడ కూడా హ్యాట్రిక్..??balakrisha{#}Simha;Narasimha;Success;Father;Darsakudu;Jr NTR;Hindupuram;Balakrishna;Director;Venkatesh;CinemaSun, 09 Jun 2024 12:49:00 GMTనందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ వారిలో ఎవరూ కూడా సక్సెస్ కాలేకపోయారు ఒక్క బాలకృష్ణ తప్ప. ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ అంతటి సక్సెస్ సాధించగలిగారు. అయితే తారక్ ఓన్లీ సినిమాల్లో మాత్రమే సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లో ఆయన పెద్దగా క్లీక్‌ అవ్వలేదు. నిజానికి ఇటువైపు రావడానికి ఆయనకు ఆసక్తి లేదు. అయితే నరసింహ నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాలోని కాకుండా రాజకీయంలో కూడా బాగా సక్సెస్ అయ్యారు. హిందూపురం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.

తన తండ్రి ఎన్టీఆర్ వలె బాలకృష్ణ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో కూడా దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో బాలయ్య “అఖండ”, “వీర సింహా రెడ్డి”, “భగవంత్ కేసరి” సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించి తన సత్తా చాటారు. ఆయన తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒక్క హిట్ కొట్టడానికి కష్టపడుతున్నారు కానీ బాలకృష్ణ మాత్రం 63 ఏళ్లలోనూ కుర్ర హీరోలకు పోటీగా హిట్స్ సాధిస్తున్నారు. అభిమానుల్లో ప్రతి సినిమాతోనూ కేక పుట్టిస్తున్నారు. ఆయన సినిమాలు అందరికీ పూనకాలు తెప్పిస్తున్నాయి.

అయితే ఇటు సినిమాల్లోనే కాకుండా ఆయన అటు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ సక్సెస్‌లు సాధిస్తూ బాలకృష్ణ ఆశ్చర్య పరుస్తున్నారు. ఎవరికీ సాధ్యం కాని అరుదైన విజయాలను ఆయన సాధిస్తున్నారు. బాలయ్యతో అట్లుంటది అని నిరూపిస్తున్నారు. రెండు కీలక రంగాల్లో రాణిస్తున్న ఈ నందమూరి అందగాడు అశేషమైన ప్రజాదరణ సంపాదించారు. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న NBK109 సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు బాబీ బాలకృష్ణను కొత్త అవతారంలో చూపించనున్నాడట. కథ కూడా కేక ఉంటుందని అంటున్నారు. రేపే బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా NBK109 మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నారు. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>