HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthaba795d3-5d3c-4245-b400-5847e9be3f66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthaba795d3-5d3c-4245-b400-5847e9be3f66-415x250-IndiaHerald.jpgఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఆకుకూరలను చాలా మందే తింటారు. కానీ తోటకూరను చాలా తక్కువగా తింటారు. ఎందుకంటే ఇది కాస్త పసరు వాసన వస్తుందని కొందరు దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ నిజానికి తోటకూర మనకు అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే తోటకూర తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి తోటకూర వHealth{#}Calcium;Sugar;Cancer;Vitamin C;Potassium;Iron;Heartఈ ఆకుకూర తింటే ఏ జబ్బు రానే రాదు?ఈ ఆకుకూర తింటే ఏ జబ్బు రానే రాదు?Health{#}Calcium;Sugar;Cancer;Vitamin C;Potassium;Iron;HeartSun, 09 Jun 2024 17:14:00 GMTఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఆకుకూరలను చాలా మందే తింటారు. కానీ తోటకూరను చాలా తక్కువగా తింటారు. ఎందుకంటే ఇది కాస్త పసరు వాసన వస్తుందని కొందరు దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ నిజానికి తోటకూర మనకు అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, పోషకాలు  అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలోనే తోటకూర తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి తోటకూర వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల తోటకూరను తింటుంటే ఐరన్ పుష్కలంగా లభించి రక్తం అనేది అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఇంకా అలాగే షుగర్ సమస్య ఉన్నవారు రోజూ 20 ఎంఎల్ మోతాదులో తోటకూర జ్యూస్‌ను తాగినా చాలు షుగర్ లెవల్స్ ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే తోటకూరలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలనుచాలా బలంగా మారుస్తుంది.తోటకూర గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.


ఎందుకంటే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని ఈజీగా నియంత్రిస్తుంది. అందువల్ల గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. పైగా తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా బీటాకెరోటిన్‌ ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఈజీగా రక్షిస్తాయి. ఒత్తిడి, వాపుల నుంచి కూడా రక్షిస్తాయి. ఇక అధిక బరువు తగ్గాలనుకుంటున్నవారు తోటకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. తోటకూరలో చాలా తక్కువ క్యాలరీలు అనేవి ఉంటాయి. అందువల్ల అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పోషక పదార్థం అని చెప్పవచ్చు.అలాగే తోటకూరలో విటమిన్లు ఎ, సి, కె లతోపాటు ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి, వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇంకా అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల కూడా తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ రాకుండా సులభంగా అడ్డుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>