PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani861b428c-67d5-4d81-98aa-5fa263b41764-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani861b428c-67d5-4d81-98aa-5fa263b41764-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ వాళ్లు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. భూములను కొడాలి నాని ఆక్రమించేసారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు వీరు అధికారంలో లేరు కాబట్టి మోసపోయిన వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొడాలి నాని ఆక్రమించిన ఒక భూమిని తిరిగి బాధితులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బాధితులుగా చెప్పుకునే వారి ప్రకారం కొడాలి నాని తమకు సంబంధించినటువంటి 9 ఎకరాల భూమిని కబ్Kodali Nani{#}Nani;Kodali Nani;ramu;Heart;District;MLA;police;YCP;TDP;Andhra Pradeshభూములు ఆక్రమించేసిన కొడాలి నాని.. తిరిగి లాగేసుకున్న బాధితులు..??భూములు ఆక్రమించేసిన కొడాలి నాని.. తిరిగి లాగేసుకున్న బాధితులు..??Kodali Nani{#}Nani;Kodali Nani;ramu;Heart;District;MLA;police;YCP;TDP;Andhra PradeshSun, 09 Jun 2024 10:11:00 GMTకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ వాళ్లు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. భూములను కొడాలి నాని ఆక్రమించేసారని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు వీరు అధికారంలో లేరు కాబట్టి మోసపోయిన వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొడాలి నాని ఆక్రమించిన ఒక భూమిని తిరిగి బాధితులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బాధితులుగా చెప్పుకునే వారి ప్రకారం కొడాలి నాని తమకు సంబంధించినటువంటి 9 ఎకరాల భూమిని కబ్జా చేశారట. అందుకే తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో లేకపోవడం, తమ వైపు టీడీపీ కూటమి, పోలీసులు అండగా ఉండటం వల్ల, భూమిని తిరిగి తీసుకోగలిగామని వాళ్లు అంటున్నారు.

ఆ 9 ఎకరాల ల్యాండ్‌కు గతంలో కొడాలి నాని ఫెన్సింగ్ నిర్మించాలని సమాచారం. అయితే ఇప్పుడు బాధితులు రెండు జేసీబీలను తెప్పించి ఆ భూమి చుట్టూ ఉన్న కంచెలను పీకి పక్కన పడేసారని తెలుస్తోంది. అనంతరం ఆ బాధితులు ‘‘కొడాలి నాని అరాచకాలు నశించాలి’’ అంటూ నినాదాలు చేయగా.. ఆ వీడియోలు, ఫోటోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. బాధితులుగా చెప్పుకునే వీళ్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన భూమిని కొడాలి నాని, ఆయన అనుచరులతో కలిసి కబ్జా చేశాడు. ఇది అన్యాయమని వాపోతే అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించాడు. మాపై దాడి కూడా చేయించాడు. పోలీసులు, కోర్టు, ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాం కానీ మాకు న్యాయం జరగలేదు. వెనిగండ్ల రాము సహాయంతో ఇప్పుడు మేము మా భూమిని తిరిగి తీసుకోగలిగాం." అని చెప్పుకొచ్చారు.

కొడాలి నాని అసలైన 420 అని కూడా వారు ఆరోపించారు. ఆయన రాజకీయాల్లో లేకుండా చేస్తామని అన్నారు. కాగా ప్రస్తుతం ఈ భూకబ్జా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా హార్ట్ టాపిక్ గా మారింది. కొడాలి నానిపై ఇంకెన్ని ఆరోపణలు వస్తాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>