PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-letest-update-fresh-news6d881cfc-d19b-44e6-a327-1344348f7bb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-letest-update-fresh-news6d881cfc-d19b-44e6-a327-1344348f7bb2-415x250-IndiaHerald.jpg2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో వై సి పి పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అలాగే భారీ మొత్తంలో ఈ పార్టీకి పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చాయి. ఆ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి చాలా తక్కువ అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి అయితే కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం దక్కింది. దానితో రాష్ట్రంలో వై సి పి పార్టీ అధికారంలోకి వచ్చింది. గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో జనాలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్cbn{#}Parliament;kalyan;Janasena;Parliment;Assembly;Andhra Pradesh;YCP;Party;Minister;Telugu Desam Party;Bharatiya Janata Party;CBN;Juneభారీ సీట్లు వచ్చాయి ఓకే... ఆ విషయంలో చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలుకానుందా..?భారీ సీట్లు వచ్చాయి ఓకే... ఆ విషయంలో చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలుకానుందా..?cbn{#}Parliament;kalyan;Janasena;Parliment;Assembly;Andhra Pradesh;YCP;Party;Minister;Telugu Desam Party;Bharatiya Janata Party;CBN;JuneSun, 09 Jun 2024 17:45:00 GMT2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో వై సి పి పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అలాగే భారీ మొత్తంలో ఈ పార్టీకి పార్లమెంట్ స్థానాలు కూడా వచ్చాయి. ఆ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి చాలా తక్కువ అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి అయితే కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం దక్కింది. దానితో రాష్ట్రంలో వై సి పి పార్టీ అధికారంలోకి వచ్చింది.

గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో జనాలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే నేపథ్యంలో ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. 2024వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వాటికి ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి.

ఈ ఫలితాలు కూటమికి భారీ అనుకూలంగా వచ్చాయి. వైసీపీ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇకపోతే సపరేట్ గా తెలుగుదేశం పార్టీకి కూడా భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇక్కడ వరకు అంతా ఓకే కానీ మంత్రులుగా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు అనే దానిపైన అసలు సమస్య ప్రారంభం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకు అంటే తన పార్టీ నుండే దాదాపు 130 మంది కంటే ఎమ్మెల్యేలు అయ్యారు.

వారిలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. జనసేన పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే బీ జే పీ నుండి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. దానితో తన పార్టీలో గెలిచిన కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి. అలాగే జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ కు కచ్చితంగా కీలక మంత్రి పదవి ఇవ్వాలి అలాగే ఈ పార్టీలోని మరికొంత మందికి కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. అలాగే బిజెపి పార్టీ సభ్యులకు కూడా కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవన్నీ సరి చేసే విషయంలో చంద్రబాబుకు కొత్త టెన్షన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>