Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7465a376-e736-4da5-8cb4-b419a0c02072-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7465a376-e736-4da5-8cb4-b419a0c02072-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ టోర్ని ప్రారంభమైంది. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ క్రమంలోనే మొత్తంగా 20 టీమ్స్ పాల్గొంటూ ఉండగా.. ఇందులో చిన్న టీమ్స్ తో పాటు అగ్రశ్రేణి టీమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు.. ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది అని ఏ క్రికెట్ నిపుణుడిని అడిగిన అటు అగ్రశ్రేణి టీమ్స్ లో కొన్ని జట్ల పేర్లను చCricket {#}Cricket;Pakistan;New Zealand;Scotland;West Indies;World Cup;Event;Champion;ICC T20ఇదెక్కడి ట్విస్ట్ బాసూ..T20 WCలో చిన్న జట్లే టాపర్లు?ఇదెక్కడి ట్విస్ట్ బాసూ..T20 WCలో చిన్న జట్లే టాపర్లు?Cricket {#}Cricket;Pakistan;New Zealand;Scotland;West Indies;World Cup;Event;Champion;ICC T20Sun, 09 Jun 2024 07:50:00 GMTప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ టోర్ని ప్రారంభమైంది. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ క్రమంలోనే మొత్తంగా 20 టీమ్స్ పాల్గొంటూ ఉండగా.. ఇందులో చిన్న టీమ్స్ తో పాటు అగ్రశ్రేణి టీమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు.. ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది అని ఏ క్రికెట్ నిపుణుడిని  అడిగిన అటు అగ్రశ్రేణి టీమ్స్ లో కొన్ని జట్ల పేర్లను చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ జట్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తాయని.. తప్పకుండా టైటిల్ విజేతగా నిలుస్తాయి అని అంచనా వేస్తూ ఉంటారు  కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం అందరి అంచనాలు తారుమారు అవుతున్నాయి.



 అద్భుతంగా రాణిస్తాయి అని భారీ అంచనాలతో బరిలోకి దిగిన అగ్రశ్రేణి టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేస్తూ ఉన్నాయి. ఏకంగా ఛాంపియన్ టీమ్స్ కి సైతం షాక్ ఇస్తూ వరుస విజయాలు సాధిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఏ జట్టు ఎప్పుడు సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది అనే విషయం తెలియక.. ప్రతి మ్యాచ్ ని కూడా కన్నార్పకుండా చూసేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇలా t20 వరల్డ్ కప్ 2024 టోర్నిలో చిన్న టీమ్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి అనడానికి ఇప్పుడు కొన్ని గ్రూపులలో టాప్ లో ఉండడమే సాక్ష్యం అని చెప్పాలి.



 ఏకంగా నాలుగు గ్రూపుల్లో మూడు చిన్న టీమ్స్ టేబుల్ టాపర్లు గా ఉన్నాయి. గ్రూప్ ఎ నాలుగు పాయింట్లతో యూఎస్ఏ టాప్ లో ఉండగా, గ్రూప్ బి లో మూడు పాయింట్లతో స్కాట్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రూప్ సీలో నాలుగు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ టాపర్లుగా ఉన్నాయి అని చెప్పాలి. గ్రూప్ డి లో మాత్రం పటిష్టమైన జట్టుగా చెప్పుకునే దక్షిణాఫ్రికా రెండు పాయింట్స్ తో తొలి స్థానంలో ఉంది. అయితే మ్యాచ్ లు జరిగే కొద్ది టేబుల్ టాపర్లు మారే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే యూఎస్ఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్ల గురించి సంచలన విజయాలను నమోదు చేశాయి అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>