MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f748ad0-59ca-4dda-835b-4cc00723b6bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f748ad0-59ca-4dda-835b-4cc00723b6bc-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు. హైపర్ ఆది ప్రస్తుతం ఢీ షో చేస్తున్నారు. సీజన్ 1 కి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దించారు యాజమాన్యం.శేఖర్‌ మాస్టర్‌ యథావిధిగానే tollywood{#}Sridevi Kapoor;geetha madhuri;nandu;pranitha subhash;sudigali sudheer;Sekhar Master;Athadu;AdiNarayanaReddy;Jabardasth;prema;sekhar;Hansika Motwani;Love;Master;sree;Hero;June;CBN;BEAUTY;Cinemaఅందరి ముందే హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హన్సిక..!?అందరి ముందే హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హన్సిక..!?tollywood{#}Sridevi Kapoor;geetha madhuri;nandu;pranitha subhash;sudigali sudheer;Sekhar Master;Athadu;AdiNarayanaReddy;Jabardasth;prema;sekhar;Hansika Motwani;Love;Master;sree;Hero;June;CBN;BEAUTY;CinemaSun, 09 Jun 2024 17:00:00 GMTజబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు.  జబర్దస్త్‌తో పాటు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు.  హైపర్ ఆది ప్రస్తుతం ఢీ షో చేస్తున్నారు. సీజన్ 1 కి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీజన్ 2 కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దించారు యాజమాన్యం.శేఖర్‌ మాస్టర్‌

 యథావిధిగానే కొనసాగుతున్నారు.  శేఖర్ మాస్టర్, హన్సికతో పాటు గణేష్ మాస్టర్ కూడా 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'కు జడ్జిగా వ్యవహరించనున్నాడు. యంగ్ హీరో, సింగర్ గీతా మాధురి భర్త నందు యాంకరింగ్ చేస్తున్నాడు. 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'కు కూడా అతడు యాంకరింగ్ చేశాడు. ఆదితో పాటు శ్రీ సత్య కూడా టీమ్ లీడర్.  జూన్ 12న టెలికాస్ట్ అయ్యే 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'కు యంగ్ హీరో సుధీర్ బాబు గెస్టుగా వచ్చాడు. అతడు యాక్ట్ చేసిన 'హరోం హర' విడుదలకు రెడీ అయ్యింది. జూన్ 14న థియేటర్లలో సందడి చెయ్యనుంది.

మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన సుధీర్ బాబు... శేఖర్ మాస్టారును పొగిడాడు. అప్పుడు ఆది వరుసపెట్టి శేఖర్ మీద సెటైర్లు వేశాడు. ఆది మాట్లాడుతూ .. మీరు ఎస్ఎంఎస్ సినిమా ఒక్కసారే చేశారు. కానీ మీ సినిమా వచ్చినప్పటి నుంచి కొందరికి రోజు శేఖర్ మాస్టర్ ఎస్ఎంఎస్ లు చేస్తూనే ఉంటారు అని సెటైర్ వేశాడు.  ఆది అంతటితో ఆగలేదు. మీ ప్రేమ కదా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు కదా .. కానీ శేఖర్ మాస్టర్ ని చూస్తే ఆ దెయ్యమే పారిపోతుంది అంటూ పంచులు వేసి శేఖర్ మాస్టర్ పరువు తీసేసాడు. దీంతో కొత్త జడ్జి హన్సిక హైపర్ ఆది కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ ఏ ఆది… శేఖర్ మాస్టర్ చాలా మంచివారు .. నువ్వు నోరు మూసుకో’ అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో హైపర్ ఆది నాలుగు రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అని అంటాడు.!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>