PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-9e683de4-34c8-49cc-8165-fa22fa512315-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-9e683de4-34c8-49cc-8165-fa22fa512315-415x250-IndiaHerald.jpg2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీ సాధించడంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మోదీ ఇవాళ రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా ప్రమాణం చేశారు. దీంతో ఆయన మూడోసారి ప్రధాని అయినట్లు అయింది. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడుసార్లు పీఎం అయిన ఏకైక వ్యక్తి మోదీ అని చెప్పుకోవచ్చు. ఆయన భారత ప్రజలకు మరోసారి పీఎం అయిన ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. pm modi {#}Kothapalli Samuel Jawahar;Gujarat - Gandhinagar;Sardar Vallabhai Patel;MLA;రాజీనామా;Telangana Chief Minister;Party;Narendra Modi;India;Prime Minister;Bharatiya Janata Party;CMప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో తెలిస్తే...?ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో తెలిస్తే...?pm modi {#}Kothapalli Samuel Jawahar;Gujarat - Gandhinagar;Sardar Vallabhai Patel;MLA;రాజీనామా;Telangana Chief Minister;Party;Narendra Modi;India;Prime Minister;Bharatiya Janata Party;CMSun, 09 Jun 2024 20:26:41 GMT 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీ సాధించడంతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మోదీ ఇవాళ రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా ప్రమాణం చేశారు. దీంతో ఆయన మూడోసారి ప్రధాని అయినట్లు అయింది. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడుసార్లు పీఎం అయిన ఏకైక వ్యక్తి మోదీ అని చెప్పుకోవచ్చు. ఆయన భారత ప్రజలకు మరోసారి పీఎం అయిన ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.

మోదీ మొదటగా జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేరారు. అలా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి అతని అసలైన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అలా బీజేపీలో చేరిన కొద్ది సమయానికి మోదీ ముఖ్యమైన బాధ్యతలను స్వీకరించారు. పాలిటిక్స్ పట్ల ఆయనకున్న డెడికేషన్, మంచి తెలివి కారణంగా అంచెలంచెలుగా ఎదిగారు.

1995లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైనప్పుడు మోదీ రాజకీయ చతురత వెలుగులోకి వచ్చింది. భారతదేశం అంతటా పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, 2001లో నరేంద్ర మోదీ రాజకీయ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశూభాయ్ పటేల్ రాజీనామా తర్వాత, మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తూ బీజేపీ హైకమాండ్ ఓ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.

ఆ సమయంలో ఎమ్మెల్యే కానప్పటికీ, మోదీ సవాలును స్వీకరించారు. తరువాత ఉప ఎన్నికలో విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.  అయితే గుజరాత్ అల్లర్ల విషాద సంఘటనల తరువాత అతను చాలా కష్టకాలన్నీ ఫేస్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేసే సీఎం గా గెలిచారు. అనంతరం భారతదేశానికి పీఎం గా ఎదిగారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాయి నుంచి భారతదేశంలో అత్యున్నత పదవికి ఆయన ఎదగడం ఆయన గొప్ప నాయకత్వానికి నిదర్శనం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>