Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-13ce4305-829e-4b24-b02d-9ed82c268537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-13ce4305-829e-4b24-b02d-9ed82c268537-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారీ అంచనాలతో వరల్డ్ కప్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కొన్ని టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంటే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయ్. ఏకంగా ఛాంపియన్ టీమ్స్ కి సైతం షాక్ ఇస్తున్నాయి. కొన్ని చిన్న టీమ్స్ ఏకంగా చాంపియన్ టీమ్స్ ఓటమి భయం ఎలా ఉంటుందో చూపిస్తుంటే.. మరి కొన్ని జట్లు అయితే ఓడCricket {#}Champion;New Zealand;South Africa;Netherlands;Pakistan;World CupT20WC.. సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించిన పసికూన?T20WC.. సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించిన పసికూన?Cricket {#}Champion;New Zealand;South Africa;Netherlands;Pakistan;World CupSun, 09 Jun 2024 11:15:00 GMTప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారీ అంచనాలతో వరల్డ్ కప్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కొన్ని టీమ్స్ చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంటే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయ్. ఏకంగా ఛాంపియన్ టీమ్స్ కి సైతం షాక్ ఇస్తున్నాయి.


 కొన్ని చిన్న టీమ్స్ ఏకంగా చాంపియన్ టీమ్స్ ఓటమి భయం ఎలా ఉంటుందో చూపిస్తుంటే.. మరి కొన్ని జట్లు అయితే ఓడించి చూపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ను అమెరికా, న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా పసికూనా నెదర్లాండ్స్  భయంకరమైన సౌత్ ఆఫ్రికా ను దాదాపు ఓడించినంత పని చేసింది. ఓటమి భయం రుచి ఎలా ఉంటుందో ఆ జట్టుకు చూపించింది. ఏకంగా నెదర్లాండ్స్ బౌలర్లు దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు ఎక్కడ క్రీజులో నిలవలేక వికెట్ సమర్పించుకొని పెవిలియన్ కు క్యూ కట్టారు అని చెప్పాలి.



 ఏకంగా డెత్ ఓవర్లలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు. ఏకంగా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా పిలుచుకునే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ బౌలర్లు దాటికి 12 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో ప్రత్యర్థి బౌలర్ల దాటికి 8.2 ఓవర్లకు గాని ఒక్క బౌండరీ కూడా బాధ లేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు క్రీజ్ లో కుదురుకొని నిలకడగా ఆడటంతో.. చివరికి ఎంతో చెమటోడ్చి పసికూనా నెదర్లాండ్స్ పైన అటు సౌత్ ఆఫ్రికా జట్టు విజయం సాధించగలిగింది అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ టి20 వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ అసమాన్యమైన ప్రదర్శన చేస్తూ బడా టీమ్స్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>