MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva-movie8a23ae1d-642c-40af-92e9-ca21742a2f72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva-movie8a23ae1d-642c-40af-92e9-ca21742a2f72-415x250-IndiaHerald.jpgతమిళ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈయన తమిళ, తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా సూర్య "కంగువ" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇక సూర్య శివ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది.Kanguva Movie{#}Bobby Deol;devi sri prasad;disha patani;surya sivakumar;Diwali;Graphics;Chitram;war;News;Director;bollywood;Success;Hero;Telugu;Cinemaసూర్య 'కంగువ' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడేనా?సూర్య 'కంగువ' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడేనా?Kanguva Movie{#}Bobby Deol;devi sri prasad;disha patani;surya sivakumar;Diwali;Graphics;Chitram;war;News;Director;bollywood;Success;Hero;Telugu;CinemaSat, 08 Jun 2024 11:50:02 GMTతమిళ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈయన తమిళ, తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా సూర్య "కంగువ" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇక సూర్య శివ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో  తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రిందటే పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి అవ్వకపోవడం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా అవుతూ వస్తుంది. ఈ మూవీ కి సంబంధికి  ఒక తాజా అప్డేట్ బయటికి  వచ్చింది. 

ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నార. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ పై ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఆఫిషియల్ గా ఈ సినిమా నుండి తాజాగా పదివేల మందితో ఒక వార్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నట్టుగా యూనిట్ నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 

ఇక దానితో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సూర్య, బాబీ డియోల్  ఇద్దరి మధ్య దానికి తగ్గట్టుగానే  పది నిమిషాల పాటు ఫైట్ ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంతో మరోసారి ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు డైరెక్టర్ శివ అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశాడు. ఆయన గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ తో డిఫరెంట్ అటెంప్ట్ ను ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాతో తాను సూపర్ సక్సెస్ అవుతాడని చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.స్టూడియో గ్రీన్ , UV క్రియేషన్స్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>