PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-news-lates-death-news-telugu-news-hyderabad-usha-kiran-movies-ramoji-film-citye0452493-65b6-428c-a3a4-8dae11c300af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-news-lates-death-news-telugu-news-hyderabad-usha-kiran-movies-ramoji-film-citye0452493-65b6-428c-a3a4-8dae11c300af-415x250-IndiaHerald.jpgరామోజీ రావు మీడియా రంగంలోనే కాకుండా సినిమా రంగంలో కూడా బాగా సక్సెస్ సాధించారు. న్యూస్ పేపర్‌లో సినిమా సెక్షన్ తీసుకురావాలని మొదటగా ఆలోచన చేసింది. ఆయన తరువాత చాలామంది దీన్నే ఫాలో అయ్యారు. సినిమాలు అంటే రామోజీరావుకు చాలా ఇష్టం. అందుకే 1983లో ఉషాకిరణ్ మూవీస్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. రామోజీ గ్రూపులో ఒక సంస్థగా ఉషా కిరణ్ మూవీస్ అంకురార్పణ జరిగింది. కొత్తవారికి, టాలెంట్ ఉన్నవారికి ఈ సంస్థ చాలా సినిమా అవకాశాలను అందించింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే వారికి కొత్త లైఫ్ ఇచ్చింది.ramoji rao news lates death news telugu news hyderabad usha kiran movies ramoji film city{#}pragathi;Chaitanya;Prasthanam;Success;Population;television;House;media;usha;ramoji rao;Chitram;Cinemaఆ ఉషా కిరణాల ఉదయభానుడు రామోజీ!!ఆ ఉషా కిరణాల ఉదయభానుడు రామోజీ!!ramoji rao news lates death news telugu news hyderabad usha kiran movies ramoji film city{#}pragathi;Chaitanya;Prasthanam;Success;Population;television;House;media;usha;ramoji rao;Chitram;CinemaSat, 08 Jun 2024 11:50:02 GMTరామోజీ రావు మీడియా రంగంలోనే కాకుండా సినిమా రంగంలో కూడా బాగా సక్సెస్ సాధించారు. న్యూస్ పేపర్‌లో సినిమా సెక్షన్ తీసుకురావాలని మొదటగా ఆలోచన చేసింది. ఆయన తరువాత చాలామంది దీన్నే ఫాలో అయ్యారు. సినిమాలు అంటే రామోజీరావుకు చాలా ఇష్టం. అందుకే 1983లో ఉషాకిరణ్ మూవీస్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. రామోజీ గ్రూపులో ఒక సంస్థగా ఉషా కిరణ్ మూవీస్ అంకురార్పణ జరిగింది. కొత్తవారికి, టాలెంట్ ఉన్నవారికి ఈ సంస్థ చాలా సినిమా అవకాశాలను అందించింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే వారికి కొత్త లైఫ్ ఇచ్చింది.

1984లో 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాని నిర్మించడంతో ఈ సంస్థ ప్రస్థానం మొదలయ్యింది. కాంచనగంగ, ప్రేమించు - పెళ్లాడు, మౌన పోరాటం, పీపుల్ ఎన్‌కౌంటర్‌, మయూరి ఈ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఈ సంస్థ బ్యానర్‌లో రిలీజ్ అయ్యి మంచి హిట్స్ సాధించాయి. ఆ తర్వాత ఈ సంస్థ నిర్మించిన "ప్రతిఘటన" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ మూవీతో రామోజీరావు మంచి లాభాలను గడించారు. ఒకటి ట్రెండ్ కూడా సెట్ చేశారు. మనసు - మమత, అమ్మ, చిత్రం వంటి సినిమాలు కూడా బాగా ఆడాయి.

"ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌనప్రభోదాలు జగతికి ప్రాణాలు ప్రగతి రధ చక్రాలు" అంటూ ఈ బ్యానర్ ప్రోమో వినిపించగానే చాలా మంచి అనుభూతి కలిగేది. అంతరంగాలు, అన్వేషిత వంటి టీవీ సీరియల్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. దీని కింద 80కి పైగా సినిమాలు నిర్మితమై మంచి హిట్స్ సాధించాయి. కమర్షియల్ సినిమాల వాసన జోలికి పోకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే రామోజీరావు ప్రాధాన్యత ఇచ్చారు. 'ప్రతిఘటన', 'మౌన పోరాటం', 'మయూరి' సినిమాలతో ఉషాకిరణ్ మూవీస్‌కు ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చింది.

అయితే రామోజీరావు చాలా సెలెక్టివ్ గా ఉండేవారు. కథ బాగుంటేనే ఒప్పుకునేవారు. ఆ కథ ఓకే కావడానికి పెద్ద తతంగమే జరిగేది. ట్రెండ్ సెటర్ "శివ" లాంటి సినిమా కథలను కూడా ఉషా కిరణ్ మూవీస్ రిజెక్ట్ చేసింది. ఒకప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీ వరుసగా సినిమా చేసుకుంటూ వెళ్ళింది కానీ ఇప్పుడు మాత్రం ఈ నిర్మాణ సంస్థ జోరు తగ్గింది. 2015 తర్వాత ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ఏ మూవీ కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంతలోనే రామోజీరావు మరణించారు దాంతో ఈ ప్రొడక్షన్ హౌస్ కంబ్యాక్‌కు బ్రేకులు పడినట్లు అయ్యింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>