PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-ramoji-raoa307bc07-04e5-4a1d-81f2-d97dbe2b2229-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-ramoji-raoa307bc07-04e5-4a1d-81f2-d97dbe2b2229-415x250-IndiaHerald.jpgఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించారు రామోజీరావు. జూన్ 5వ తేదీన... శ్వాస తీసుకునేందుకు రామోజీరావు చాలా ఇబ్బంది పడ్డారట. దీంతో గత మూడు రోజులుగా ఆయన ఇంట్లో రామోజీరావుకు చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే నిన్న రాత్రి నుంచి రామోజీరావు పరిస్థితి విషమించడంతో... ఆసుపత్రికి తరలించారు. RAMOJI RAO{#}television;village;Heart;Khammam;history;INTERNATIONAL;media;June;ramoji rao;eenaduరామోజీ లైఫ్ హిస్ట‌రీ.. పెద‌పారుపూడి టు మ‌హాసామ్రాజ్యం వ‌ర‌కు..!రామోజీ లైఫ్ హిస్ట‌రీ.. పెద‌పారుపూడి టు మ‌హాసామ్రాజ్యం వ‌ర‌కు..!RAMOJI RAO{#}television;village;Heart;Khammam;history;INTERNATIONAL;media;June;ramoji rao;eenaduSat, 08 Jun 2024 08:02:15 GMTఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించారు రామోజీరావు. జూన్ 5వ తేదీన... శ్వాస తీసుకునేందుకు రామోజీరావు చాలా ఇబ్బంది పడ్డారట. దీంతో గత మూడు రోజులుగా ఆయన ఇంట్లో రామోజీరావుకు చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే నిన్న రాత్రి నుంచి రామోజీరావు పరిస్థితి విషమించడంతో... ఆసుపత్రికి తరలించారు.

 ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించడం జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు కుటుంబ సభ్యులు. వాస్తవానికి కృష్ణాజిల్లా పెదపారుపూడి  లో 1936 సంవత్సరంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రామోజీరావు. రామోజీరావు తాతయ్య రామయ్య... మరణించిన 13 రోజులకే రామోజీరావు జన్మించారు. దీంతో... తాత జ్ఞాపకార్థం రామయ్య పేరు కలిసేలా రామోజీరావు అని పెట్టారట.

 గుడివాడలో విద్యాభ్యాసం చేసిన రామోజీరావు... పచ్చళ్ల వ్యాపారం చేసి... ఈనాడు సంస్థ అధినేతగా ఎదిగారు. మొదటగా పచ్చళ్ల వ్యాపారంతో బిజినెస్ ప్రారంభించి 1962లో మార్గదర్శి  చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మార్గదర్శి... నమ్మకానికి మారుపేరుగా ఉంటుంది. 1967 సంవత్సరంలో ఎరువుల వ్యాపారం లోకి కూడా దిగారు. మొట్ట మొదటగా ఖమ్మం జిల్లాలో ఎరువుల వ్యాపారాన్ని మొదలుపెట్టి.. అంచలంచలుగా దిగారు.

1969 సంవత్సరంలో అన్నదాత ద్వారా మీడియా రంగంలోకి రంగ ప్రవేశం చేశారు రామోజీరావు. ఇక 1974 సంవత్సరంలో ఈనాడు పత్రికను... స్థాపించి చరిత్ర సృష్టించారు రామోజీరావు. ఆ తర్వాత ఈ టీవీ ఛానల్  పెట్టడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీని నిర్మించి... అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రామోజీరావు. 2016 సంవత్సరంలో..  రామోజీరావుకు పద్మ విభూషణ్  అవార్డు కూడా వరించింది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ రామోజీరావు తన సత్తా చాటారు. ఇటు చాలా రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చే వారిలో కూడా  రామోజీరావు తన ముద్ర వేసుకున్నారు.  ఇలా చిన్న గ్రామం నుంచి... అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు రామోజీరావు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>