Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-71f80355-b697-4a5c-b2e9-3eae27e324ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-71f80355-b697-4a5c-b2e9-3eae27e324ea-415x250-IndiaHerald.jpgజూన్ రెండవ తేదీన ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఈ టోర్నమెంట్లో ఏకంగా 20 టీమ్స్ పాల్గొన్నాయ్. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా ఈసారి ప్రపంచకప్ టోర్నీ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే సాధారణంగా అటు అమెరికాలో క్రికెట్ కి పెద్దగా ఆదరణ ఉండదు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏకంగా క్రికెట్ ను మరిన్ని దేశాలకు విస్తరించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అమెరికాలో వరల్డ్ కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్Cricket {#}American Samoa;West Indies;BCCI;World Cup;Cricket;Pakistanధనిక దేశం అమెరికాలో.. క్రికెటర్ల మ్యాచ్ ఫీజు ఇంతేనా?ధనిక దేశం అమెరికాలో.. క్రికెటర్ల మ్యాచ్ ఫీజు ఇంతేనా?Cricket {#}American Samoa;West Indies;BCCI;World Cup;Cricket;PakistanSat, 08 Jun 2024 10:00:00 GMTజూన్ రెండవ తేదీన ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఈ టోర్నమెంట్లో ఏకంగా 20 టీమ్స్ పాల్గొన్నాయ్. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా ఈసారి ప్రపంచకప్ టోర్నీ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే సాధారణంగా అటు అమెరికాలో క్రికెట్ కి పెద్దగా ఆదరణ ఉండదు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏకంగా క్రికెట్ ను మరిన్ని దేశాలకు విస్తరించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అమెరికాలో వరల్డ్ కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది.


 ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా గురించి ఎన్నో విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అక్కడ క్రికెటర్లకు ఎలాంటి వసతులు అందుబాటులో ఉన్నాయి. క్రికెటర్ల వేతనం ఎంత అనే విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా కొనసాగుతున్న అమెరికాలో.. అటు క్రికెటర్ల వేతనం ఎంత అనే విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అమెరికాలో క్రికెటర్లకు ఇంత తక్కువగా వేతనం ఇస్తున్నారా అని చర్చించుకుంటున్నారు.


 ఎందుకంటే ధనిక దేశంలో క్రికెటర్ల మ్యాచ్ ఫీజు కేవలం 20వేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన యుఎస్ఏ జట్టు సంచలనాలు నమోదు చేస్తుంది. పాకిస్తాన్ లాంటి వరల్డ్ కప్ ఛాంపియన్ ను మట్టి కరిపించి.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అమెరికా జట్టులో చాలామంది ప్లేయర్లు ఉద్యోగాలు చేస్తూనే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారట. వారి మ్యాచ్ ఫీజు తక్కువ కావడం కారణంగానే.. ఇలా క్రికెట్ కి పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నారట. అయితే బిసిసిఐ భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లిస్తుంది అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>