Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-994a98cb-1920-47dc-a0d7-a070a5319be6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-994a98cb-1920-47dc-a0d7-a070a5319be6-415x250-IndiaHerald.jpgసాధారణంగా వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో అగ్రశ్రేణి టీమ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అతి కష్టం మీద అర్హత సాధించిన కొన్ని చిన్న టీమ్స్ వరుస పరాజయాలతో చివరికి టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఊహించని రీతిలో ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో మాత్రం చిన్న టీమ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాయ్. ఏకంగా పెద్ద టీమ్స్ కి సైతం షాక్ ఇస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇక ఈ టి20 వరల్డ్ కప్ ఎన్నో సCricket {#}Aly Khan;Ireland;American Samoa;World Cup;Qualification;ICC T20;Pakistan;Indiaమా నెక్స్ట్ టార్గెట్ టీమ్ ఇండియానే.. సవాల్ విసిరిన చిన్న టీమ్?మా నెక్స్ట్ టార్గెట్ టీమ్ ఇండియానే.. సవాల్ విసిరిన చిన్న టీమ్?Cricket {#}Aly Khan;Ireland;American Samoa;World Cup;Qualification;ICC T20;Pakistan;IndiaSat, 08 Jun 2024 11:00:00 GMTసాధారణంగా వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో అగ్రశ్రేణి టీమ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అతి కష్టం మీద అర్హత సాధించిన కొన్ని చిన్న టీమ్స్ వరుస పరాజయాలతో చివరికి టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఊహించని రీతిలో ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో మాత్రం చిన్న టీమ్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాయ్. ఏకంగా పెద్ద టీమ్స్ కి సైతం షాక్ ఇస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక ఈ టి20 వరల్డ్ కప్ ఎన్నో సంచలన విజయాలకు చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల అమెరికా జట్టు ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. మొదటి మ్యాచ్ లోనే ఆ జట్టుకు ఓటమిని కట్టబెట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై విజయంతో అమెరికా బౌలర్ అలీ ఖాన్ ఎంతో ఉత్సాహంతో పొంగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ నెక్స్ట్ టార్గెట్ భారత్ అంటూ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయ్.  పాకిస్తాన్తో విజయం తర్వాత మాట్లాడిన ఆ జట్టు బౌలర్ అలీ ఖాన్ మా జట్టు పని ఇంకా పూర్తి కాలేదని.. సూపర్ 8 కి అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు.


 పాకిస్తాన్ లాంటి గొప్ప జట్టుపై మా విజయం ఎంతో గొప్పది. మేము చాలా కాలంగా ఈ దశ కోసం ఎదురు చూస్తున్నాము. అయితే ఈ అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నా  సూపర్ 8 కి అర్హత సాధించడమే మా పని.. కాబట్టి ఇంకా మా పని పూర్తి కాలేదు. మా నెక్స్ట్ టార్గెట్ భారత్.. ఇక ఆ జట్టు పై కూడా తప్పక విజయం సాధిస్తాం. అలాగే ఐర్లాండ్ పైకి కూడా విజయం సాధించి సూపర్ 8 లోకి వెళ్తాం అంటూ అమెరికా బౌలర్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్ కు చెందిన అలీ ఖాన్ ప్రస్తుతం అమెరికా తరఫున ఆడుతున్నాడు. అతను వేసిన నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఫకర్ జమాన్  వికెట్ పడగొట్టాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>