PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nda-jbu-cbn-indi-kutami-nda-rahul-gandhiab3650ec-93cf-4924-a86c-5015940b2673-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nda-jbu-cbn-indi-kutami-nda-rahul-gandhiab3650ec-93cf-4924-a86c-5015940b2673-415x250-IndiaHerald.jpgబిజెపి గత రెండు పర్యాయాలు దేశాన్ని పాలించింది. మోడీ ప్రధానిగా ఉంటూ దేశ రక్షణకు ఎంతో పాటుపడ్డారు. అలాంటి బిజెపి ఈసారి కూడా 400 పైగా సీట్లు సాధిస్తానని నమ్మి చివరికి బోల్తా పడింది. కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతోంది. ఇదే తరుణంలో ఇండికూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ దాదాపుగా 234 సీట్ల వరకు గెలుచుకుంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మేజిక్ ఫిగర్ 272 అందుకోవాలి. కానీ బిజెపి ప్రగల్బాలకు ఎక్కువ పనితనానికి తక్కువ అన్నట్టు ఎన్నో ప్రగల్బాలు పలికి చివరికnda;jbu;cbn;indi kutami;nda;rahul gandhi{#}Congress;Bihar;Nitish Kumar;Prime Minister;Party;CBN;TDP;Bharatiya Janata Party;Newsనితీష్ కు ప్రధాని ఆఫర్.. ఎన్డీఏకు బై బై చెప్తారా.?నితీష్ కు ప్రధాని ఆఫర్.. ఎన్డీఏకు బై బై చెప్తారా.?nda;jbu;cbn;indi kutami;nda;rahul gandhi{#}Congress;Bihar;Nitish Kumar;Prime Minister;Party;CBN;TDP;Bharatiya Janata Party;NewsSat, 08 Jun 2024 19:29:00 GMT బిజెపి గత రెండు పర్యాయాలు దేశాన్ని పాలించింది. మోడీ ప్రధానిగా ఉంటూ  దేశ రక్షణకు ఎంతో పాటుపడ్డారు. అలాంటి బిజెపి ఈసారి కూడా 400 పైగా సీట్లు సాధిస్తానని  నమ్మి చివరికి  బోల్తా పడింది. కేవలం 240  సీట్లు మాత్రమే గెలుచుకొని  ప్రభుత్వ ఏర్పాటుకు తహతహలాడుతోంది. ఇదే తరుణంలో ఇండికూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్  దాదాపుగా 234 సీట్ల వరకు గెలుచుకుంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మేజిక్ ఫిగర్ 272 అందుకోవాలి. కానీ బిజెపి  ప్రగల్బాలకు ఎక్కువ పనితనానికి తక్కువ అన్నట్టు  ఎన్నో ప్రగల్బాలు   పలికి చివరికి 240 స్థానాల్లో  గెలిచి ఇతర పార్టీల సాయం కోసం ఎదురుచూస్తోంది.

  ఇదే తరుణంలో దేశంలోనే ప్రధాన పార్టీలు అయినటువంటి  టిడిపి మరియు జేడీయుల సహాయం కోరుతోంది. ఈ క్రమంలో  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు పెద్దపీట వేస్తోంది. వీరిద్దరి సాయం అందితే మ్యాజిక్ ఫిగర్ దాటి 293 సీట్లు బిజెపికి ఉంటాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని ఆలోచన చేస్తోంది.  ఇదే తరుణంలో ఇండి కూటమి కూడా  వారి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎలాగైనా గ్యాలం వేసి తమ వైపు లాక్కోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండట. చివరికి ప్రధానమంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని  కెసి త్యాగి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే నితీష్ కుమార్ మాత్రం  ఆ ఆఫర్ ను చాలా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.

నేను ఎన్డీఏ కూటమిలోనే ఉంటానని అసలు బయటకు వచ్చేది లేదని  చెప్పారని త్యాగి తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  ఒకవేళ జెడియు అధినేత  నితీష్ కుమార్ డ్రాప్ అయితే మాత్రం ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక కష్టమే. ఆయన డ్రాప్ అయిన వెంటనే చంద్రబాబు కూడా  డ్రాప్ అవుతారు.  దీంతో బిజెపి పెద్దలంతా ఈ ఇద్దరు కీలక నాయకులకు ఏది అడిగిన ఇస్తామని, వారికే పెద్దపీట వేసి  వారి రాష్ట్రాలకు ఏది కావాలన్నా తీసుకోవాలని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఇండి కూటమి ఇంకా ఏదైనా ప్లానింగ్ చేసి ఎన్డీఏ కూటమిని కూల్చేస్తుందా లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ప్రశ్నిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>