PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/former-minister-kodali-nani-targeted-and-beatend8fc08cb-916c-4a91-af6f-eda12bfee4cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/former-minister-kodali-nani-targeted-and-beatend8fc08cb-916c-4a91-af6f-eda12bfee4cc-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు... మాకు కూడా టైం వస్తుందని హెచ్చరించారు. అప్పటివరకు మేం కూడా ఓపిక పడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత... వైసిపి పార్టీ నేతలపై అలాగే కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వైసిపి నేతల కార్లపై కూడా... విపరీతంగా దాడులు చేస్తున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు. వైయస్సార్ విగ్రహాలకు తెలుగుదేశం జెండాలు కప్పుతున్నారు. కొన్నిచోట్ల వైయస్సార్ పేరు ఉన్న... వాటిkodali nani{#}Kodali Nani;Army;Bihar;Telugu Desam Party;police;Janasena;Government;YCP;TDP;Andhra Pradeshటీడీపీ పార్టీకి కొడాలి నాని హెచ్చరికలు..!టీడీపీ పార్టీకి కొడాలి నాని హెచ్చరికలు..!kodali nani{#}Kodali Nani;Army;Bihar;Telugu Desam Party;police;Janasena;Government;YCP;TDP;Andhra PradeshSat, 08 Jun 2024 15:19:39 GMTతెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు... మాకు కూడా టైం వస్తుందని హెచ్చరించారు. అప్పటివరకు మేం కూడా ఓపిక పడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత... వైసిపి పార్టీ నేతలపై అలాగే కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వైసిపి నేతల కార్లపై కూడా... విపరీతంగా దాడులు చేస్తున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు. వైయస్సార్ విగ్రహాలకు తెలుగుదేశం జెండాలు కప్పుతున్నారు. కొన్నిచోట్ల వైయస్సార్ పేరు ఉన్న... వాటిని బద్దలు కొడుతున్నారు.


అయితే ఈ హింసకాండపై కొడాలి నాని స్పందించారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారుఇల్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. వైసిపి నేతలను క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు.


టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పై హైకోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. ప్రతి నియోజక వర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తామన్నారు. టీడీపీ, జన సేన రౌడీ మూకలు రెచ్చిపోయి మారణ హోమం చేస్తున్నాయని ఆగ్రహించారు. టీడీపీ నేతలు, డీజీపీ కేసులు పెట్టవద్దని పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు.... యూపీ, బీహార్ మాదిరి హింసా రాష్ట్రంగా టీడీపీ మారుస్తోందని ఫైర్‌ అయ్యారు.


అరాచక మూకలను ఆపాలసిన పోలీసులు బెదిరిస్తున్నారని.. కౌంటింగ్ పూర్తి అవ్వక ముందే బందరు లో దాడులకు తెగ బడ్డారని నిప్పులు చెరిగారు. ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయటం లేదన్నారు. టీడీపీ నేతలు పోలీసులను పతనావస్థకు తెచ్చారని ఆగ్రహించారు. బరితెగించి మరీ దాడులకు పాల్పడుతున్నారు... వైసీపీ వాళ్ళు కొడుతున్నారు అని మాట్లాడటం దారుణం అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>