Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea0715223-8670-4847-bdc0-8e8cbc082db6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea0715223-8670-4847-bdc0-8e8cbc082db6-415x250-IndiaHerald.jpgపవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పవన్‌ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ బద్రి సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని సహజీవనం చేసి మ్యారేజ్‌ చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరికి కొడుకు అకీరా నందన్‌ జన్మించారు. పెళ్లి తర్వాత కూతురు ఆద్య జన్మించింది. అనంతరం రెండేళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు. కొంత కాలం తర్వాత తాను ఒంటరిగా ఉండలేక రెండో పెళ్socialstars lifestyle{#}Badri;renu desai;television;Father;marriage;Cinemaరెండో పెళ్లి పై మరోసారి స్పందించిన రేణుదేశాయ్.. పిల్లలే కారణమంటూ..??రెండో పెళ్లి పై మరోసారి స్పందించిన రేణుదేశాయ్.. పిల్లలే కారణమంటూ..??socialstars lifestyle{#}Badri;renu desai;television;Father;marriage;CinemaSat, 08 Jun 2024 18:15:00 GMTపవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పవన్‌ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ బద్రి సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని సహజీవనం చేసి మ్యారేజ్‌ చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరికి కొడుకు అకీరా నందన్‌ జన్మించారు. పెళ్లి తర్వాత కూతురు ఆద్య జన్మించింది. అనంతరం రెండేళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు. కొంత కాలం తర్వాత తాను ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధమైంది రేణు.ఓ వ్యక్తితో రేణు దేశాయ్‌ ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. ఆ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. కానీ ఎవరనేది బయటకు చెప్పలేదు. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుని ఒంటరిగానే ఉంటుంది రేణు దేశాయ్‌. ఆల్మోస్ట్ 12ఏళ్లుగా సింగిల్‌గానే ఉంటోంది. తన కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యల పోషణ, స్టడీస్‌ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది. మధ్యలో సినిమా వైపు కూడా వచ్చింది. ఓ మూవీని డైరెక్ట్ చేసింది. ఇటీవల `టైగర్‌ నాగేశ్వరరావు`లో నటిగానూ మెరిసింది. టీవీ షోస్‌లో జడ్జ్ గా అలరించింది.సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది రేణు దేశాయ్‌. తనకు సంబంధించిన చాలా విషయాలను ఆమె పంచుకుంటుంది. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తో ట్రోల్ కి గురవుతుంది. వారికి కౌంటర్లు కూడా ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల యూట్యూబ్‌ ఇంటర్వ్యూలిస్తూ మరింత చర్చనీయాంశంగా మారుతుంది. పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణు దేశాయ్‌ పాజిటివ్‌గా స్పందించింది.

 తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేణు దేశాయ్‌. రెండో పెళ్లిపై స్పందించింది. తాను మ్యారేజ్‌ చేసుకోవడానికి రెడీనే అని, కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా మ్యారేజ్‌ చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. అయితే ఇప్పటికే మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి అసలు కారణాలను బయటపెట్టింది రేణు.
అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి కారణం చెబుతూ, ఆ సమయంలో తమ పిల్లలు అకీరా, ఆద్య చిన్నగా ఉన్నారు, వారికి కేర్ టేకర్‌ కావాలి. వారికి తోడు కావాలి. తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైమ్‌ కేటాయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రి దూరంగా ఉంటున్నారు, తాను కూడా దూరమైతే వాళ్లు ఒంటరి ఫీలింగ్‌ని ఫేస్‌ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో మ్యారేజ్‌ చేసుకోలేదని చెప్పింది రేణు దేశాయ్‌.మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు వాళ్లకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం వస్తుంది. వారితోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్‌ అవరు, కేవలం సపోర్టింగ్‌ కోసమే పేరెంట్స్ అవసరం అవతారు, కానీరోజంతా పేరెంట్స్ అవసరం లేదు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను, తన మ్యారేజ్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతాను. అందుకే ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తున్నాను అని తెలిపింది రేణు దేశాయ్‌. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నాకు మ్యారేజ్‌ లైఫ్‌ కావాలి, అందరిలా నేను కూడా మ్యారేజ్‌లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్పింది.`నా పెళ్లికి సంబంధించి పిల్లలు కూడా పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్లే `మమ్మి మ్యారేజ్‌ చేసుకో`మంటున్నారు, నీవు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో, ఎవరి కేరింగ్‌ని ఇష్టపడతావో వాళ్లని పెళ్లి చేసుకో మమ్మి అంటారు. తాను సిక్‌గా ఉన్నప్పుడు వాళ్లు ఫీలవుతుంటారు. అందుకే మ్యారేజ్‌ విషయంలో వాళ్లు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటారని చెప్పింది రేణు దేశాయ్‌. ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది రేణు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>