PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramoji-raoa84b6751-021f-4368-830c-7352f4e3fc6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramoji-raoa84b6751-021f-4368-830c-7352f4e3fc6d-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈనాడు అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ ఓనర్ రామోజీరావు ఇక లేరు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. ఇవాళ ఉదయం ఈనాడు అధినేత రామోజీరావు మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఇవాళ వేకువ జామున 4.05 రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తుది శ్వాస విడిచారు. Ramoji RAO{#}Telugu;Friday;Manam;ramoji rao;Hyderabad;eenadu;Newsఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూతఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూతRamoji RAO{#}Telugu;Friday;Manam;ramoji rao;Hyderabad;eenadu;NewsSat, 08 Jun 2024 07:03:30 GMT
 హైదరాబాద్ లోని... నానక్ రామ  గూడాలో ఉన్న స్టార్ హాస్పిటల్  లో రామోజీరావు మరణించారు. ఇవాళ ఉదయం ఇదే హాస్పిటల్లో... రామోజీరావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో రామోజీరావు బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలాసార్లు ఆయన ఆసుపత్రిలో చేరడం... పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడం... ఇలా చాలా  సంఘటనలు మనం చూసాం.

అయితే... శుక్రవారం రాత్రి మాత్రం...  ఈనాడు అధినేత రామోజీరావు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. ఒకసారి గా ఆయన బెడ్ రూమ్ లో కుప్పకూలినట్లు... వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన రామోజీరావు కుటుంబ సభ్యులు... ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత... రామోజీరావును ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్యులు... రామోజీరావును వెంటిలేటర్ పై  ఉంచారు.

 ఇవాళ ఉదయం 4 గంటల సమయం వరకు... అత్యాధునిక చికిత్స రామోజీరావుకు అందించారు వైద్యులు. కానీ డాక్టర్ల ప్రయత్నం విఫలమైంది. వెంటిలేటర్ పైన ఆయన శరీరం... అనుకూలించలేక... తుది శ్వాస విడిచారు రామోజీరావు. ఇదే తరుణంలో...4.50 గంటలకు తుది శ్వాస విడిచారు రామోజీరావు. దీంతో ఫిల్మి సిటీలోని  ఆయన నివాసానికి రామోజీరావు  పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. రేపు రామోజీరావు అంతక్రియలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలుపుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>