PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawankalyan-janasena-tdp-ycp-cbna4fa4f6c-2ee3-4d77-9206-9b6843ae2a12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawankalyan-janasena-tdp-ycp-cbna4fa4f6c-2ee3-4d77-9206-9b6843ae2a12-415x250-IndiaHerald.jpgసరైన లక్ష్యాన్ని పెట్టుకుని, లక్ష్యం కోసం ప్రతిక్షణం పరితపించి కష్టపడితే ఎప్పుడైనా విజయం తద్యం అనేది పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థమవుతుంది. ఆటుపోట్లను, ఆటంకులను మాటలను పట్టించుకోలేదు. తనను ఎంత కించపరిచారో ఆ మాటలనే మెట్లుగా మలుచుకున్నాడు. తనపై పడ్డ నిందలను పంటి కింద దిగబట్టుకొని ప్రజాసేవకై పయనమయ్యాడు. ఎంతో సాధన చేశాడు చివరికి జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తిరుగులేని శక్తిగా తయారు చేశాడని చెప్పవచ్చు. తాను పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలుచుకొని దేశంలోనే ఏ రాజకీయ పార్pawankalyan;janasena;tdp;ycp;cbn{#}king;King;kalyan;central government;Capital;polavaram;Polavaram Project;Service;Bharatiya Janata Party;Party;Andhra Pradeshఏపీ:పవన్ పవర్ తో ప్రాజెక్టులు పూర్తవుతాయా..?ఏపీ:పవన్ పవర్ తో ప్రాజెక్టులు పూర్తవుతాయా..?pawankalyan;janasena;tdp;ycp;cbn{#}king;King;kalyan;central government;Capital;polavaram;Polavaram Project;Service;Bharatiya Janata Party;Party;Andhra PradeshSat, 08 Jun 2024 11:02:38 GMT- దేశ రాజకీయాల్లోని కింగ్ మేకర్.
-ప్రత్యేక నిధుల కోసమే పోరాటం.
- తన పవర్ తో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారా.?


సరైన లక్ష్యాన్ని పెట్టుకుని, లక్ష్యం కోసం ప్రతిక్షణం పరితపించి కష్టపడితే ఎప్పుడైనా విజయం తద్యం అనేది పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థమవుతుంది. ఆటుపోట్లను, ఆటంకులను మాటలను పట్టించుకోలేదు. తనను ఎంత కించపరిచారో ఆ మాటలనే మెట్లుగా మలుచుకున్నాడు. తనపై పడ్డ నిందలను పంటి కింద దిగబట్టుకొని   ప్రజాసేవకై పయనమయ్యాడు. ఎంతో సాధన చేశాడు చివరికి జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తిరుగులేని శక్తిగా  తయారు చేశాడని చెప్పవచ్చు.  తాను పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలుచుకొని దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా గెలవని విధంగా విజయం సాధించారు. 

కానీ పవన్ కళ్యాణ్ తన విజయంలో  ఆనందాన్ని వెతుక్కోవడం లేదు. తాను గెలిచింది 21 సీట్లు అయినా 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ  సేవ చేసే బాధ్యత తనపై ఉందని అంటున్నారు.  విజయం వచ్చిందని సంతోష పడకూడదని, అపజయం కలిగిందని బాధపడకూడదని తన కిందిస్థాయి నాయకులకు చెబుతూనే తాను చేయాల్సినటువంటి బాధ్యతల కోసం ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పే స్థాయికి చేరుకున్నాడు. తనంటే ఎంత మంది చులకన చేశారో,  అంతమందికి  చెంపపెట్టులా మారారు.  ప్రస్తుతం దేశ రాజకీయాలను శాసించే బిజెపి కూడా పవన్ చేతిలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ మంచి ఆఫర్ ను పవన్ కళ్యాణ్ ఏపీని అభివృద్ధి చేయడంలో ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఏపీ తెలంగాణతో విడిపోయిన తర్వాత చాలా విషయాల్లో వెనుకబడింది.

 రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తవలేదు. ప్రత్యేక రైల్వే జోన్ లో పనులు ఆగిపోయాయి. ఇంకెన్నో అభివృద్ధి పనులకు నిధులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  అలాంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక నిధులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారట. ఈ నిధులు తీసుకువచ్చి ముఖ్యంగా  రాష్ట్ర భవిష్యత్తునే మార్చే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయిస్తారట. అంతేకాకుండా ప్రత్యేక రైల్వే జోన్లు కూడా తేవడానికి ప్రత్యేక కృషి చేస్తారట. అలాగే రాజధాని విషయంలో కూడా కేంద్ర సహకారం తీసుకుంటారని ఈ విధంగా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో పవన్ పవర్ ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ హయాంలో ఏపీ ఏ విధంగా   అభివృద్ధిలో దూసుకుపోతుందనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>