PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-news-telugu-latest-updates-viral-news-rajamouli-about-him797675ae-ecfe-4055-85cc-bdb7cc2169ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-news-telugu-latest-updates-viral-news-rajamouli-about-him797675ae-ecfe-4055-85cc-bdb7cc2169ae-415x250-IndiaHerald.jpgఈనాడు మీడియా వ్యవస్థాపకుడు రామోజీ రావు జూన్ 8న తెల్లవారు ఝామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మ‌ర‌ణానికి ముందు ఆయ‌న తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నారని స‌మాచారం. దాంతో ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు సంతాపం వెల్లువెత్తుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా తరలి వెళ్తున్నారు. ఫిలింసిటీకి రద్దీ పెర‌గ‌డంతో దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసియున్నారు.ramoji rao news telugu latest updates viral news rajamouli about him{#}venkaiah naidu;Rajamouli;sree;Service;Narendra;Venkatesh;Narendra Modi;Jr NTR;Chiranjeevi;NTR;Jagan;media;ramoji rao;Telugu;Tollywoodరామోజీరావు విషయంలో రాజ‌మౌళి డిమాండ్ ఇదే!రామోజీరావు విషయంలో రాజ‌మౌళి డిమాండ్ ఇదే!ramoji rao news telugu latest updates viral news rajamouli about him{#}venkaiah naidu;Rajamouli;sree;Service;Narendra;Venkatesh;Narendra Modi;Jr NTR;Chiranjeevi;NTR;Jagan;media;ramoji rao;Telugu;TollywoodSat, 08 Jun 2024 12:46:00 GMTఈనాడు మీడియా వ్యవస్థాపకుడు రామోజీ రావు జూన్ 8న తెల్లవారు ఝామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మ‌ర‌ణానికి ముందు ఆయ‌న తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నారని స‌మాచారం. దాంతో ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు సంతాపం వెల్లువెత్తుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా తరలి వెళ్తున్నారు. ఫిలింసిటీకి రద్దీ పెర‌గ‌డంతో దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసియున్నారు. భార‌త‌దేశ ప్ర‌ధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎస్ఎస్ రాజమౌళి, జయప్రకాష్ నారాయణ, ఎంఎం కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, జూనియర్ ఎన్టీఆర్, పుల్లెల గోపీచంద్ స‌హా ప‌లువురు రామోజీని సందర్శించడం జరిగింది.

ప్ర‌ధాని నరేంద్ర మోదీ అయితే ఈ క్రమంలో రామోజీ రావు గురించి సుదీర్ఘంగా లేఖ‌ రాయడం జరిగింది. రామోజీ రావు గారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ఓ ఒరవడిని తీసుకువచ్చారు... వారికి ఓం శాంతి.. అని మోదీజీ సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మీడియా వేదికగా మాట్లాడుతూ... దేశానికి ఎంతో సేవ చేసిన రామోజీరావు గారికి ఖచ్చితంగా 'భారత రత్న' ప్రకటించి తీరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఎవ్వ‌రికీ త‌ల‌వొంచ‌ని మేరు ప‌ర్వ‌తం శ్రీ రామోజీరావు.. అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడగా, త‌న‌ను సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది మీడియా దిగ్గ‌జం శ్రీ రామోజీరావు అని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్మ‌రించుకున్నారు.

దాదాపు రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు ప్రస్తుతం శ్రీ రామోజీ రావు గారి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది చాలా ఎమోషనల్ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందిస్తూ... రామోజీరావుగారు ఈ తెలుగు జాతికి చేసిన సేవలు ఎనలేనివి. తెలుగు సాహిత్యాన్ని బతికించడం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారు... అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>